ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలుతుమ్మల రంగారావుకు ఊరట.. ఎమ్మార్ కేసులో తుమ్మల రంగారావుకు ఊరట లభించింది. ఈడీ నమోదు చేసిన కేసులో తుమ్మల రంగారావుపై విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.' సినిమాటోగ్రఫీ నిబంధనలపై కౌంటర్! సినిమాటోగ్రఫీ నిబంధనలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 2006 నాటి సినిమాటోగ్రఫీ నిబంధనలు, 2012లో హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమోలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం గణతంత్ర వేడుకలకు ముందు పంజాబ్‌లో భారీ కుట్రకు ప్లాన్ చేశారు కొందరు ఉగ్రవాదులు. ఈ ఉగ్రకుట్రను భగ్నం చేసి.. భారీ మొత్తం ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.కొవిన్ పోర్టల్ డేటా లీక్!.. కొవిన్ పోర్టర్లో వ్యక్తిగత డేటా లీకైందనే వార్తలు విస్తృతమయ్యాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది.వేల ఎకరాల్లో ఫార్మాసిటీ.. ఔషధనగరి వచ్చే నెలలో పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీని వచ్చే నెలలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పదివేల ఎకరాలకు పైగా భూమిని ఇప్పటికే సేకరించగా మిగతాది వివిధ దశల్లో ఉంది. మౌలిక సదుపాయాల పనులు పూర్తి కాగా... ఉమ్మడి వ్యర్థాల నిర్వహణ ప్లాంటు కోసం ఆసక్తి వ్యక్తీకరణ గడువు నెలాఖరుతో ముగియనుంది. లఖింపుర్ ఘటనలో మరో ఛార్జ్‌షీట్.. లఖింఫుర్ హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలైంది. భాజపా కార్యకర్తలు, వాహనం డ్రైవర్‌పై జరిగిన దాడికి సంబంధించి ఏడుగురు రైతులపైనా అభియోగాలు మోపుతూ రెండో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు అధికారులు.త్వరలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాసంగి సీజన్ సాగునీటితో పాటు తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల అంశంపై సమావేశంలో చర్చించనుంది.సాగర్ వద్ద వాక్ వే.. హైదరాబాద్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. పర్యాటకుల కోసం విదేశాల్లో మాదిరిగా ఆకట్టుకునేలా మరో నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ వద్ద ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించనున్నారు.కెప్టెన్‌లుగా రాహుల్, హార్దిక్ పాండ్య లఖ్‌నవూ సారథిగా కేఎల్ రాహుల్, అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆటగాళ్ల ఎంపికను పూర్తిచేశాయి కొత్త జట్లు.సినిమా టైటిల్స్.. క్రేజీ ట్రెండ్ పాత్రల పేర్లే సినిమాలకూ పేర్లవుతున్నాయి. విడుదల తర్వాత కథల కంటే ఆ పాత్రలే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి హావభావాలు, నడవడికను ప్రేక్షకులు అనుకరించేంతగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల 'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ చేసిన పుష్పరాజ్ పాత్ర జనంలోకి ఎంతగా వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టా రీల్స్, మీమ్స్ నుంచి యూట్యూబ్ పేరడీల వరకూ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఈ పాత్ర మేనరిజాన్ని అనుసరించారు.