ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుదేశంలో భారీగా కరోనా కేసులు భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 2,82,970 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజు 441 మంది మరణించారు. 1,88,157 మంది కొవిడ్‌ను జయించారు.ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య వ్యవసాయంలో నష్టం వచ్చినా కూడా.. మరో ఏడాది పంటలు బాగా పండుతాయని ఆశతో సాగు చేస్తుంటారు అన్నదాతలు. అదే ఆశతో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఈ సారి అయినా పంటలు బాగా పండుతాయని అనుకున్నారు. తీరా చూస్తే మిర్చి పంటపై తామర పురుగు దాడి చేసింది. వడగండ్ల వాన చేతికందవచ్చిన పంటలను నాశనం చేసింది. ఓ వైపు పంటనష్టం.. మరోవైపు అప్పుల బాధ.. చేసేది లేక ఇద్దరు రైతులు ఉసురు తీసుకున్నారు.'భూదాన్ పోచంపల్లి ఎంపిక గర్వకారణం' ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి ఎంపికవడం.. రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచ పర్యాటక గ్రామంగా.. గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ పర్యాటక గ్రామం పోటీలో భూదాన్ పోచంపల్లి పురస్కారం పొందడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచం గుర్తింస్తుందని ఆయన వెల్లడించారు.రైలుకింద పడి జూనియర్ ఆర్టిస్టు మృతి కదులుతున్న రైలు ఎక్కబోయి కింద పడిన మహిళ తీవ్రగాయాలకు గురై మరణించిన సంఘటన షాద్‌నగర్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. మృతురాలు ఏపీలోని కడప వాసిగా పోలీసులు గుర్తించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగిగా చేస్తూ.. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోందని వెల్లడించారు.'మాస్కు తప్పనిసరేం కాదు.. మోదీనే చెప్పారు' మాస్కు ధరించడం తప్పనిసరేం కాదంటూ కర్ణాటకకు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఈ మాట చెప్పారంటూ బుకాయించారు.మహిళల లోదుస్తుల దొంగ.. ఇళ్లల్లోకి చొరబడి మహిళల లోదుస్తులను అపహరిస్తున్న దొంగను ఓ న్యాయమూర్తి చాకచక్యంగా పట్టించారు. గతకొన్ని రోజులుగా లోదుస్తుల చోరీ ఘటనలు అనేకం జరగ్గా.. రంగంలోకి దిగిన జడ్జి.. దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.జియోకు భారీగా పెరిగిన కొత్త యూజర్లు దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా రిలయన్స్ జియో నిలిచింది. నవంబర్‌లో ఏకంగా 20.19 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది జియో. ఎయిర్‌టెల్ సైతం తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. ఇక వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది.555 క్యారెట్ల అరుదైన నల్ల వజ్రం ప్రపంచంలోనే అరుదైన నల్ల వజ్రం వేలానికి సిద్ధమైంది. బ్లాక్‌డైమండ్ 555 క్యారెట్ల బరువు ఉన్నట్లు దుబాయ్‌లోని వజ్రాల వేలం సంస్థ సోత్‌బై తెలిపింది. దీని ధర రూ. 50 కోట్లు ఉంటుందని పేర్కొంది.కివీస్-ఆస్ట్రేలియా సిరీస్ వాయిదా కివీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన వాయిదా పడింది. న్యూజిలాండ్‌లో ఉన్న క్వారంటైన్ నిబంధనల కారణంగా ఈ టూర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.కమల్‌హాసన్ డిశ్ఛార్జి వైద్యపరీక్షల కోసం ఆస్పత్రిలో చేరిన కమల్.. ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. ఆయన మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు.