తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2022, 7:02 AM IST

ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​ @7AM

ఇప్పటివరకు ప్రధానవార్తలు

Top News Today , telangana news
టాప్​టెన్​ న్యూస్​ @7AM

  • పల్లె ప్రగతికి ప్రవాస హారతి

ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఏ స్థాయికి ఎదిగినా.. మాతృభూమిపై మమకారాన్ని వీడలేదు. తమను ఇంతవారిని చేసిన సొంతూరి అభివృద్ధిలో తాము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. తమతో పాటు.. తమ పల్లె ప్రజలంతా బాగుండాలని, వారి జీవితాలూ మెరుగుపడాలని సేవలందిస్తున్నారు పలువురు ప్రవాసాంధ్రులు.

మిర్చి పంటను తామర పురుగు దెబ్బతీయడంతో... రైతులు ప్రత్యామ్నాయ విధానం ఎంచుకుంటున్నారు. పచ్చి మిరపకాయలనే... కోసి మార్కెట్లకు తరలిస్తున్నారు. ఎంతో కొంత పెట్టుబడులైనా వస్తాయని అన్నదాతలు ఆశిస్తున్నారు.

  • పండక్కి ఊరెళ్తున్నారా..?

సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు పయనవుతున్న నగరవాసులకు ఇల్లు గుల్లవుతుందేమోనని భయం పట్టుకుంది. నగర శివారు ప్రాంతాలతో పట్టపగలే చోరీలు జరుతున్న వార్తలు విని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది అయితే ఇంటికి తాళం వేసి పండుగకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలోపడ్డారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఊరికి వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు.

  • ఇకపై పగలు కూడా డ్రంకెన్​డ్రైవ్​ టెస్టులు..

రోడ్డు ప్రమాదాలకు నివారించేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇప్పటికే కొరడా ఝులిపిస్తున్న పోలీసులు... ఈ విషయంలో మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు రాత్రి వేళల్లోనే చేపట్టే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను పగటిపూట కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

  • రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ

పబ్​జీ ఆట ఆ సోదరుల ప్రాణాలను తీసింది. రైలు పట్టాలపై కూర్చొని ఫోన్​లో పబ్​జీ ఆడుతూ రైలు కిందపడి చనిపోయారు. ఈ ఘటన రాజస్థాన్​లోని అల్వార్ జిల్లాలో జరిగింది.

  • యూపీ ఎన్నికల ప్రకటన

యూపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం కాన్పూర్ పోలీస్​ కమిషనర్ ఆసిమ్​ కుమార్​ అరుణ్​ వీఆర్​ఎస్(స్వచ్ఛంద పదవీ విరమణ) కోరుకున్నారు. ఎన్నికల్లో భాజపా తరఫున అరుణ్​ బరిలోకి దిగనున్నాడని సమాచారం.

  • ఇద్దరు క్యాబ్ డ్రైవర్ల హత్య

రూ.600 కోసం ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను హత్య చేశారు ఇద్దరు టీనేజర్లు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. ఇంతకు వారు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే?

  • సిరాజ్ స్థానంలో ఎవరు?

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డాడు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్. వాండరర్స్‌ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు కేవలం 15.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు మూడో టెస్టుకు దాదాపుగా దూరమైనట్లే. దీంతో మూడో మ్యాచ్​లో అతడి స్థానంలో ఏ బౌలర్​ను తీసుకోవాలనే విషయం టీమ్ఇండియాకు తలనొప్పిగా మారింది.

  • 'సినిమాలు వదిలేద్దామనుకున్నా..'

గడిచిన నాలుగేళ్లలో చాలా ఒడుదొడుకులను ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు దర్శకుడు కల్యాణ్​కృష్ణ. ఆ సమయంలో సినిమాలు వదిలేద్దామన్నా ఆలోచన వచ్చిందని, అప్పుడు హీరో నాగార్జున తనకు అండగా నిలిచారని అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'బంగార్రాజు' సినిమా జనవరి 14న రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా కెరీర్​ సహా చిత్ర విశేషాలను తెలిపారాయన. ఆ సంగతులను చూసేద్దాం..

ABOUT THE AUTHOR

...view details