తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2022, 12:58 PM IST

ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటివరకు ప్రధానవార్తలు

Top News Today, telangana news
టాప్​టెన్​ న్యూస్

  • దుర్గమ్మ దర్శనానికి వెళ్లి కుటుంబం బలవన్మరణం

అప్పులు... రాకాసిలా మారాయి... ఎటు వెళ్లినా వెంటాడాయి... కళ్లు మూస్తే కలల రూపంలో... కళ్లు తెరిస్తే కొండలా పేరుకుపోయిన వడ్డీ రూపంలో! ఆ బాధ ముందు మరో ఆలోచనేదీ రాలేదేమో! రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు జీవితం పంచుకున్న భార్య... తాను ఈ లోకం నుంచి శాశ్వతంగా వదిలి వెళ్లిపోవాలనే ఆ ఇంటి యజమాని నిర్ణయం.. నలుగురి ప్రాణాలు తీసింది. దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన ఆ కుటుంబం... అక్కడే ఉసురు తీసుకుంది.

  • 'వనమా రాఘవ అంగీకరించాడు'

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కాసేపట్లో అతనిని కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. రామకృష్ణను బెదిరించినట్లు అతను ఒప్పుకున్నాడని తెలిపారు. వనమా రాఘవ బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

  • ఎల్బీనగర్​లో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌ పరిధిలో రెండు కాలేజీ విద్యార్థుల గ్యాంగ్‌లు హల్‌చల్‌ చేశాయి. సిరినగర్‌ కాలనీలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ముగ్గురు విద్యార్థులు ఓ ఇంట్లో దాక్కోగా.. మరో గ్యాంగ్‌ ఆ ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించింది. అడ్డుకున్న ఇంటివారిపైనా దాడికి దిగింది.

  • ఊరెళ్తున్న భాగ్యనగరం..

సంక్రాంతి పండుగ దగ్గరికొచ్చింది. అందుకే భాగ్యనగరం ఊరెళ్తోంది. పండుగ కోసం ఏపీకి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ వద్ద రద్దీ పెరిగింది. పంతంగి టోల్​ప్లాజా వద్ద ఫాస్టాగ్ ఉండటం వల్ల వాహనాల రాకపోక సాఫీగా సాగింది.

  • పాస్​పోర్టుల జారీపై కరోనా ఎఫెక్ట్

రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీపై కొవిడ్ తీవ్రప్రభావం చూపింది. 2019లో ఐదున్నర లక్షల మంది పాస్‌పోర్టు సేవలు వినియోగించుకోగా.. 2020లో 3 లక్షల కంటే తక్కువ మందే పాస్‌పోర్టులు తీసుకున్నారు. 2021లో పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో 4.42 లక్షల మందికి పాస్​పోర్టులు జారీ అయ్యాయి.

  • ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు

ఉత్తర్​ప్రదేశ్, ఉన్నావ్​లో భాజపా ఎమ్మెల్యే పంకజ్ గుప్తాపై ఓ రైతు చేయిచేసుకున్నాడు. సభలో అందరు చూస్తుండగా స్టేజీపైకి వచ్చి గుప్తా చెంప చెళ్లుమనిపించాడు.

  • 'ట్యాక్స్​ కడితే.. షేర్ ఇస్తాం'

'ఆర్​బీఐ వద్ద రూ.55వేల కోట్లు ఫ్రీజయ్యాయి. ట్యాక్స్​ కట్టేందుకు రూ.27 కోట్లు కావాలి. ఆ నగదు సమకూరుస్తే 40 శాతం షేర్​ ఇస్తాం' అని నమ్మించి ఓ మహిళను మోసం చేశారు కొందరు దుండగులు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

  • 'మోదీ​ సభ'కు సమీపంలో పాకిస్థాన్​​ బోట్​!

ప్రధాని మోదీ పంజాబ్​లోని ఫిరోజ్​పుర్​ సభకు వెళ్తూ భద్రతా లోపం కారణంగా ఆకస్మికంగా పర్యటన ముగించారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే తాజాగా.. పాకిస్థాన్​కు చెందిన ఓ బోట్​ను బీఎస్​ఎఫ్​ సిబ్బంది శనివారం సీజ్​ చేశారు. సభా ప్రాంగణానికి సమీపంలోనే పాక్​ బోట్​ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు..

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఆస్ట్రేలియా క్రికెట్​ వెబ్​సైట్​కు కౌంటర్​ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. కోహ్లీ రెండేళ్ల ప్రదర్శనపై ఓ వెబ్​సైట్ ట్వీట్ చేయగా.. అదే రీతిలో వారికి స్మిత్ సగటు గురించి ట్వీట్ చేసి గట్టి బదులిచ్చాడు జాఫర్.

  • 'కరోనాతో గుర్తుపట్టలేనంతగా మారిపోయా'

కరోనా సోకినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను తెలిపారు బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. వైరస్​ నుంచి కోలుకున్నాక తాను గుర్తుపట్టలేనంతగా మారిపోయానని, మెదడు కూడా సరిగా పనిచేయలేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details