తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP TEN NEWS: టాప్​న్యూస్​ @1PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS

By

Published : Jan 6, 2022, 1:02 PM IST

  • న్యాయం చేయండి

భద్రాద్రిలోని వనమా రాఘవ అనుచరులపై పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తనను వనమా రాఘవ అనుచరులు వేధిస్తున్నారని పోలీసులకు రామకృష్ణ బావమరిది ఫిర్యాదు చేశారు. ఫోన్​లో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • వారిని వదలొద్దు

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు ముమ్మర దర్యాప్తు ఎందుకు చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారి చావుకు కారణమైన వనమా రాఘవపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. అధికార తెరాస ఎమ్మెల్యేలు, వారి వారసులు మాఫియాను మించి పోయారని దుయ్యబట్టారు.

  • మత్తు వదిలిస్తాం

హైదరాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. కొందరు మాత్రం డ్రగ్స్​ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు.

  • ఆశా వర్కర్లకు శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు(ఇన్సెంటివ్‌లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్‌లను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఈ పెంపు వర్తించనుంది.

  • ఉన్నతస్థాయి విచారణ

భద్రతా లోపాలతో ప్రధాని మోదీ పంజాబ్​ పర్యటన ఆకస్మికంగా రద్దయిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు పిటిషనర్​. శుక్రవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది న్యాయస్థానం. మరోవైపు.. దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది పంజాబ్​ ప్రభుత్వం.

  • కేంద్ర ఆరోగ్య శాఖతో ఈసీ భేటీ

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం(ఈసీ) భేటీ అయింది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • జీఎస్​టీ జాయింట్​ కమిషనర్​ అదృశ్యం

ఇటీవల పలువురు వ్యాపారుల ఇళ్లలో జీఎస్​టీ అధికారుల సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో ముంబయిలో జీఎస్​టీ జాయింట్​ కమిషనర్​ అదృశ్యం కలకలం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగింది?

  • పక్కా ప్లాన్​తో..

బంగారాన్ని విమానంలోని సీటు కింద దాచి తరలిస్తుండగా కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 24 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.37 కోట్లు ఉంటుందని చెప్పారు.

  • జట్టు ఖరారు

ఈ ఏడాది మార్చిలో జరగబోయే ఐసీసీ మహిళల ప్రపంచకప్​ 2022 కోసం జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్​ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్​ అక్కడికి వెళ్లనుంది.

  • మహిళా క్రికెటర్​ బయోపిక్​లో అనుష్క

టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడి సతీమణి అనుష్క.. వెండితెరపై క్రికెటర్​గా వండర్స్​ సృష్టించేందుకు సిద్ధమైంది. ఇంతకీ అది ఏ సినిమా? ఆ సంగతేంటి?

ABOUT THE AUTHOR

...view details