ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.ఇక యుద్ధమే... కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలయ్యారు. జైలులో బండి సంజయ్‌ను పరామర్శించేందుకు కేంద్రమంత్రి భగవంత్ కుబ వెళ్లారు. ఆయనతో కలిసి బండి సంజయ్ బయటకు వచ్చారు. కరీంనగర్‌లోని భాజపా కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వాడీవేడిగాతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పలువురు సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు పూర్తి..! ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను మరో రెండు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయులు సహా జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తి కాగా... జోనల్, మల్టీజోనల్ కేడర్ పోస్టుల కసరత్తు కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో పోస్టింగులు ఇచ్చి వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు.రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమిదే!భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి సాంకేతిక లోపం లేదా విద్రోహచర్య కారణం కాదని దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన నివేదిక కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చేరింది.త్వరలో సీఎంలతో మోదీ భేటీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా కట్టడి, ఆంక్షలు, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై వారితో చర్చిస్తారని చెప్పాయి.ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దుప్రభుత్వ ఉద్యోగులకు దిల్లీ సర్కారు షాకిచ్చింది. కొవిడ్ కేసులు అమాంతం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విభాగాల ఉద్యోగులు, అధికారుల సెలవులను రద్దు చేసింది. జమ్ములో ఇలాంటి పరిస్థితే తలెత్తింది. వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు అక్కడి పాలనా యంత్రాంగం తెలిపింది.మళ్లీ వర్క్ ఫ్రమ్ హోందేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పని పద్ధతికి మారిపోతున్నారు. ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్నందున తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని పలు సంస్థల సూచిస్తున్నాయి.భవనంలో అగ్నిప్రమాదం.. 13 మంది మృతిఅమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.విజయం దిశగా సౌతాఫ్రికాజోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌పై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. గెలవాలంటే మరో 122 పరుగులు చేయాలి.ఓటీటీలో 'అఖండ' రిలీజ్ ఎప్పుడంటే..Akhanda OTT Release: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్పై క్లారిటీ ఇచ్చింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.