తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News Today : టాప్​న్యూస్​@ 9AM - తెలుగు లేటెస్ట్ అప్డేట్స్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News Today , telangana news
టాప్​న్యూస్

By

Published : Jan 5, 2022, 9:01 AM IST

  • కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో మరో విషాదం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో మరో విషాదం చోటు చేసుకుంది.

  • 'హైదరాబాద్‌ తొలిపేరు భాగ్యనగర్‌ కాదు'

రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చకూడదని ప్రముఖ చరిత్రకారుడు కెప్టెన్ ఎల్. పాండురంగారెడ్డి కోరారు. హైదరాబాద్ పేరు మార్చాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డెక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్టు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

  • నేడు శాసనమండలి నూతన ప్రొటెం ఛైర్మన్‌ నియామకం

రాష్ట్ర శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి పదవీకాలం ముగియగా... నేడు కొత్తవారిని నియమించనున్నారు. మండలిలో సీనియర్‌ సభ్యులైన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్‌, వీజీ గౌడ్‌లలో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశముంది.

  • కూలీల అవసరం లేకుండా 'డ్రోన్‌' సాగు

పెరిగిన సాంకేతికతతో ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయంలోనూ చాలా యంత్రాలను రూపొందించారు. తాజాగా విత్తనాలు విత్తే డ్రోన్​ను కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇకపై కూలీల అవసరం లేకుండానే విత్తనాలను విత్తవచ్చు అన్నమాట..!

  • దంపతుల బదిలీల్లో వెసులుబాట్లు..

ప్రభుత్వ ఉద్యోగ దంపతులలో ఒకరు దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకరు పనిచేసే చోటులో మరొకరికి లేదా కొత్త స్థలంలో ఇద్దరికీ పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. దంపతుల బదిలీల్లో వెసులుబాట్లు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల, భార్యాభర్తల బదిలీలు, పోస్టింగుల కోసం అన్ని శాఖల్లో అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చింది.

  • బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు

రెండు డోసుల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి 'బూస్టర్‌ డోసు' కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.

  • 11సార్లు కరోనా టీకా వేసుకున్న వృద్ధుడు!

బిహార్​లో 84 ఏళ్ల వృద్ధుడు తాను కరోనా టీకా 11 డోసులు తీసుకున్నానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే అన్నిసార్లు వేసుకున్నానని ఆయన చెప్పారు. 12వ డోసు తీసుకునేందుకు కూడా ప్రయత్నించారు.

  • ఒక్క నెలలోనే 45లక్షల మంది రాజీనామా!

అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్నవారి సంఖ్య నవంబర్​లో భారీగా నమోదైంది. ఒక్క నెలలోనే 45 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించింది.

  • బంగ్లా చారిత్రక విజయం..

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్​ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రెండు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కివీస్​ గడ్డపై బంగ్లాకు ఇదే తొలి విజయం.

  • 'అలా అలవాటు పడితే కష్టం'

నిజ జీవితంలో ప్రేమలో పడి విడిపోయానని చెప్పిన అనుపమ.. సినిమాలోని లవ్​సీన్స్ చేసేటప్పుడు మాత్రం దాని ప్రభావం ఉండకుండా చూసుకుంటానని తెలిపింది. ఈమె హీరోయిన్​గా చేసిన మూడు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details