ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఈటల రాజేందర్ గృహనిర్బంధం పోలీసులు అధికారపక్షానికి కొమ్ము కాస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. బండి సంజయ్‌కు మద్దతుగా కరీంనగర్ వెళ్లకుండా.... హైదరాబాద్ శామీర్‌పేటలోని ఈటల నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసులు!ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం… రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన దీక్షను అడ్డుకుని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సంజయ్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.'ర్యాగింగ్ చేశారని రుజువైతే.. కఠిన చర్యలు' సూర్యాపేట వైద్యకళాశాలలో ర్యాగింగ్ జరిగిందో..? లేదో..? తెలుసుకునేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అలాంటి ఘటన జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదునిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదైంది. ప్రెస్మీట్లో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో... బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.టీనేజ్ వ్యాక్సినేషన్ దేశంలో 15-18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. జమ్ముకశ్మీర్‌లో పాక్ చొరబాటుదారుడు హతంజమ్ముకశ్మీర్లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు గుండా.. భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడిని భద్రతా దళాలు హతమార్చాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.ఆస్పత్రిలో కరోనా కలకలంఆస్పత్రిలో 87 మంది వైద్యులకు కరోనా నిర్ధరణ కావడం కలకలం రేపింది. బిహార్ పట్నాలో ఈ ఘటన జరిగింది. కొవిడ్ సోకిన వైద్యుల్లో చాలా మంది.. ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సుకు హాజరైన వారే కావడం గమనార్హం.సామూహిక అత్యాచారం చేసి..మహారాష్ట్ర ఠాణె జిల్లాలో ఓ యువతి(21)పై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం రాయితో తలపై మోది ఆమెను కిరాతకంగా చంపేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్నేహితుడు అతని స్నేహితులతో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు.రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.పోస్ట్ ప్రొడక్షన్లో 'శాకుంతలం'..సమంత టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'శాకుంతలం'. మహాభారతం ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోగా.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.