ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు 'యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే' Bhatti Vikramarka: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌లో చేసిన నాటకం ఆయన పదవిని దిగదార్చే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రిని ఫెయిల్యూర్‌గా చూపెట్టి.. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నాకు చెప్పిందదే' Bandi Sanjay Comments: హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై భాజపా నిరసన సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.అన్నకు మహేశ్ కన్నీటి వీడ్కోలు Mahesh Babu: కరోనా కారణంగా రమేశ్ బాబు కడపటి చూపునకు దూరంగా ఉన్నారు నటుడు మహేశ్ బాబు. ట్విట్టర్ వేదికగా అన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్ Nagpur Recce Case: నాగ్‌పుర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం రెక్కీ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న జమ్ముకశ్మీర్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.గెంటేసిన 76 ఏళ్లకు.. Old lady legal battle against children: కన్నబిడ్డలపైనే న్యాయపోరాటానికి దిగి విజయం సాధించారు ఓ వృద్ధురాలు. 76 ఏళ్ల వయసులో కోర్టును ఆశ్రయించి.. తనకు అనుకూలమైన తీర్పు తెచ్చుకున్నారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.తక్కువ ధరకే 'మ్యాంగో వైన్'.. Mango Wine: అక్కడి ఎక్సైజ్ శాఖ వినూత్న రీతిలో ఆలోచించింది. రాష్ట్ర ప్రజలకు మ్యాంగో వైన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపింది. కట్టె తీసుకువెళ్తుంటే.. ఎడ్లబండిని కాల్చేశారు Fire on Bullock cart: అటవీ శాఖ అధికారుల వైఖరితో ఓ నిరుపేద రైతు.. ఎడ్లబండితో పాటు తమ కుటుంబానికి ఆధారమైన ఎడ్లను పోగొట్టుకున్నారు. ఇంటిముందు పందిరి కోసం తన చేను పక్కనున్న కట్టెను తీసుకెళ్తుండగా అడ్డుకున్న అధికారులు.. ఈ ఘటనకు పాల్పడ్డారు.వాటి ధరలకు రెక్కలు..! Consumer Durables Price Hike: కొత్త ఏడాదిలో వినియోగదారులకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలు షాక్ ఇవ్వనున్నాయి. గృహోపకరణాల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్‌ల ధరలు మరింత పెరగనున్నట్లు సంబంధిత సంస్థలు పేర్కొన్నాయి. ముడిసరకు ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం అని వివరించాయి.చైతూకు అన్నగా రెడీ బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగార్జున.. 'మనం' తర్వాత కుమారుడు నాగచైతన్యతో ఈ సినిమాలో మరోసారి కలిసి నటించారు. అయితే భవిష్యత్‌లో చైతూకు అన్న పాత్రలు చేయడానికైనా సరే తాను సిద్ధమని అన్నారు. భారత్‌లోనే ఐపీఎల్..! IPL 2022: వచ్చే ఐపీఎల్ సీజన్ నిర్వహణ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నాహాలు చేస్తోంది. భారత్ వేదికగానే ఈ టోర్నీ నిర్వహించనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ కొవిడ్ వ్యాప్తి తీవ్రమైతే టోర్నీ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని అన్నారు.