తెలంగాణ

telangana

ETV Bharat / city

తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా - జేఈఈ మెయిన్ మొదటి విడత

తొలి విడత జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్ పరీక్షలో.. తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ స్కోరు సాధించారు. అయితే 100 పర్సంటైల్ మాత్రం తెలుగు విద్యార్థులు అందుకోలేక పోయారు. రాజస్థాన్, దిల్లీ, చండీగఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్ కు చెందిన.. ఆరుగురు విద్యార్థులు 100 స్కోరు సాధించారు. బాలికల విభాగంలో తెలంగాణ విద్యార్థిని కొమ్మ శరణ్య అత్యధిక పర్సంటైల్ సాధించారు. ఈడబ్ల్యూఎస్​ విభాగంలో ఏపీ విద్యార్థి అనుమల వెంకట జయ చైతన్య అత్యధిక స్కోరు సాధించారు.

telugu-students-pass-the-first-installment-of-jee-main-examination
తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా

By

Published : Mar 9, 2021, 6:06 AM IST

తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా

గత నెల 24 నుంచి 26 వరకు జరిగిన జేఈఈ మెయిన్ మొదటి విడత ఇంజినీరింగ్ పరీక్షల ఫలితాలు వెలుపడ్డాయి. దేశవ్యాప్తంగా 6 లక్షల 20 వేల 978 మంది ఆన్​లైన్‌లో పరీక్షలు రాశారు. రాజస్థాన్ విద్యార్థి సాకేత్ ఝా, దిల్లీకి చెందిన ప్రవర్ కటారియా.. రంజిమ్ ప్రబల్ దాస్, చండీగఢ్‌ విద్యార్థి గురమృత్ సింగ్, మహారాష్ట్ర విద్యార్థి సిద్ధాంత్ ముఖర్జీ.. గుజరాత్ కు చెందిన అనంత్ కృష్ణ కిడాంబి వంద పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వంద స్కోరును అందుకోలేక పోయారు. అయితే వివిధ విభాగాల్లో ఉత్తమ స్కోర్లను సాధించారు.

99.99 పర్సంటైల్

తెలంగాణలో అత్యధికంగా చల్లా విశ్వనాథ్, కొమ్మ శరణ్య సమానంగా 99.99 పర్సంటైల్ సాధించగా... ఆంధ్రప్రదేశ్ నుంచి పోతంశెట్టి చేతన్ మనోజ్ఞ సాయి 99.99 పర్సంటైల్ లో రాష్ట్రంలో టాపర్ గా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో మొదటి 5 అత్యధిక స్కోర్లలో మొదటి నలుగురు తెలంగాణ విద్యార్థులకే దక్కింది. అంచ పర్ణవి, రామస్వామి సంతోష్ రెడ్డి అత్యధిక స్కోర్లను సాధించారు. ఏపీ నుంచి అనుముల వెంకట జయ చైతన్య, గుర్రం హరిచరణ్.. అత్యధిక స్కోర్లను సాధించారు.

అత్యధిక స్కోర్లు

ఓబీసీ విభాగం అత్యధిక స్కోర్లలో తెలంగాణకు చెందిన తవిటి వెంకట మణికంఠ ఐదోస్థానంలో నిలవగా.. ఏపీ విద్యార్థి రఘురాం శరణ్ రెండో స్థానం, గొట్టిపల్లి శ్రీవిష్ణు సాత్విక్ నాలుగో స్థానం సాధించారు. ఎస్టీ విభాగంలో మొదటి మూడు అత్యధిక పర్సంటైల్ తెలంగాణ విద్యార్థులవే. ఇస్లావత్ నితిన్, బిజిలి ప్రచోతన్ వర్మ, నేనావత్ ప్రీతం ఎస్టీ విభాగంలో జాతీయ స్థాయిలో అత్యధిక స్కోర్లు దక్కించుకున్నారు. దివ్యాంగుల విభాగం అత్యధిక పర్సంటైళ్లలో ఏపీ విద్యార్థులు మల్లిన శ్రీప్రణవ్ శేషు, తల్లాడ వీరభద్ర నాగసాయి కృష్ణ మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు బాలికల విభాగంలో తెలంగాణ విద్యార్థిని కొమ్మ శరణ్య జాతీయ స్థాయిలో అత్యధిక స్కోరు సాధించగా.. తెలంగాణకే చెందిన అంచ ప్రణవి నాలుగో స్థానంలో నిలిచారు. బాలుర విభాగం అత్యధిక పది పర్సంటైల్ లో నలుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన చల్లా విశ్వనాథ్, ఎ.విక్రమ సింగ్, పి.లక్ష్మిసాయి లోకేష్ రెడ్డి 7,8,9 స్థానాల్లో ఉండగా.. ఏపీ విద్యార్థి పోతంశెట్టి చేతన్ మనోజ్ఞసాయి జాతీయ స్థాయిలో బాలుర విభాగంలో అత్యధిక పదో స్కోరు సాధించారు.

అత్యుత్తమ స్కోరు

ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పేపర్ 2 పరీక్ష ఫలితాలు త్వరలో ప్రకటించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ.. ఎన్‌టీఏ పేర్కొంది. ఈ నెల 15 నుంచి 18 వరకు జేఈఈ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్, మేలో మూడు, నాలుగు విడతల పరీక్షలు నిర్వహిస్తారు. నాలుగింటిలో కలిపి అత్యుత్త స్కోరును పరిగణలోకి తీసుకుని ర్యాంకు ఖరారు చేస్తారు.

ఇదీ చూడండి :కర్ణాటక నిర్ణయం...తెలుగు రాష్ట్రాలకు అన్యాయం

ABOUT THE AUTHOR

...view details