Telugu Student On Ukraine :అత్యవసరం అయితే తప్ప తమను బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారని.. ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ భారత్' తో అక్కడి పరిస్థితులను వివరించారు. రాజధాని కీవ్ వైపు మాత్రం ప్రయాణాలు చేయొద్దని.. జాగ్రత్తగా ఉండాలని చెప్పారన్నారు. 10 రోజులకు సరిపడా నిత్యావసరాలను ఇంట్లో ఉంచుకోవాలని అధికారులు సూచించారన్నారు.
"మా యూనివర్సిటీలో సుమారు 500 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో భారత్‌కు వచ్చే విమానాలు రద్దు అయ్యాయి. భారత రాయబార కార్యాలయ అధికారులు మాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థులందరినీ తరలిస్తామని చెప్పారు. బయటకు వెళ్లేటప్పుడు పాస్‌పోర్టు ఉంచుకోవాలని సూచించారు. తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వీడి రావాలని భారత ప్రభుత్వం చేసిన సూచన మేరకు చాలామంది స్వదేశానికి బయల్దేరుతున్నారు. మార్చి 10 వరకు ఉన్న టికెట్లన్నీ బుక్ అయిపోయాయి" అని లక్ష్మీ శ్రీలేఖ వివరించారు.
ఇండియన్ ఎంబసీ నుంచి సరైన స్పందన లేదు..