sri lankan crisis : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న శ్రీలంకను ఆదుకొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం వెళ్లనున్నాయి. శ్రీలంక అభ్యర్థన మేరకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్.. తక్షణం బియ్యం పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా జరిగింది.
sri lankan crisis News : ఇందులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, ట్యుటికోరిన్ తదితర పోర్టుల నుంచి బియ్యం శ్రీలంకకు ఎగుమతి చేయనున్నారు. మొదటగా కాకినాడ పోర్టు నుంచి బుధవారం రెండు వేల మెట్రిక్ టన్నులతో కార్గో బయలుదేరనుంది. తర్వాత చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి పంపించనున్నారు. తెలంగాణలో కొనుగోలు చేసే బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా తరలించనున్నారు. మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దశలవారీగా శ్రీలంకకు పంపుతామని భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి.కృష్ణారావు తెలిపారు.