వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. వంద లోపు ర్యాంకుల్లో దాదాపు 30కిపైగా తెలుగు విద్యార్థులే సాధించారు.
హైదరాబాద్ విద్యార్థిని టి.స్నితక జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.చైతన్య సింధు జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన అనంత పరాక్రమ జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించి.. ఎస్సీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. హైదరాబాద్ కు చెందిన సాయిత్రిషరెడ్డి 14వ ర్యాంకు సాధించారు.