తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమయ్యారు. శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుతో పాటు.. విభజన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. అటునుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో దాదాపు మూడు గంటల పాటు సమావేశమై.. కీలక విషయాలు చర్చించారు.
శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుపై... జూన్ 28న ఇద్దరు ముఖ్యమంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలసి పని చేద్దామని అంగీకారానికి వచ్చారు. ఈ దిశగా.. 2 రాష్ట్రాల ఇంజినీర్లు.. నీటి తరలింపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రలు సమీక్షించినట్లు సమాచారం. గోదావరి జలాలను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తరలిస్తే.. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరం.. ఇందుకయ్యే అంచనా వ్యయంపై ఇద్దరూ మాట్లాడుకున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.