మాదక ద్రవ్యాల రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో స్మగ్లర్లు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసుల కన్నుగప్పి గంజాయిని చేరవేసేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు. నాలుగేళ్ల కిందట నగరానికి చెందిన ఒక వైద్యుడు చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. మాసబ్ ట్యాంక్ వద్ద లిక్కర్ చాక్లెట్స్‌ను పాఠశాల విద్యార్థులకు అలవాటు చేసిన కొందరిని ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసింది. కరోనా కారణంగా తనిఖీలు నిలిపివేయటంతో అక్రమార్కులు మరింత చెలరేగిపోయారు. సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారటం కలవరపాటుకు గురిచేసింది.
కూలీలు, విద్యార్థులే లక్ష్యం..
కూలీలు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. పగలంతా కష్టపడిన కూలీలు సాయంత్రం వేళ మద్యం సేవిస్తుంటారు. మరింత కిక్ కోసం గంజాయికి దగ్గరవుతున్నారు. విందు, వినోద కార్యక్రమాల్లో విద్యార్థులు దీన్ని రుచిచూస్తున్నారు. ఇంటా, బయటా అనుమానం రాకుండా తేలికగా దాచుకునేందుకు, వాడేందుకు గంజాయి చాక్లెట్స్ అనుకూలంగా మారాయి. ఎండు గంజాయిని మెత్తగా పట్టి చాక్లెట్స్‌గా తయారు చేస్తున్నారు. కమీషన్‌పై ఆశతో పాన్ దుకాణదారులు వీటిని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. మరింత మత్తులోకి చేరేందుకు గంజాయి ఆకుల నుంచి తీసిన నూనెలో రసాయనాలను చేర్చి హాసిష్ ఆయిల్‌గా విక్రయిస్తున్నారు. గంజాయి నూనె లీటరు ధర సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకూ ఉంటుందని అంచనా. దీన్ని చిన్న అట్టపెట్టెలు, సీసాల్లో 10, 20 మిల్లీ లీటర్లుగా మార్చి ఆన్‌లైన్ ద్వారా చేరవేస్తున్నారు. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా వీటిని ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నారు.
అమాంతం పెరిగిన గంజాయి ధర..