కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సంగీత దర్శకుడు, గాయకుడు పవన్ ఓ పాట పాడారు. ఈ వైరస్ ఎంత ప్రమాదకారో వివరిస్తూ... దాన్నుంచి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను తన పాట ద్వారా చాటిచెప్పారు.
కరోనాపై పాట పాడిన పవన్ - music directer pavan song on corona
కరోనా వైరస్ ఎంత ప్రమాదకారో వివరిస్తూ... గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువసంగీత దర్శకుడు పవన్ పాట పాడారు.
corona song
పవన్ తనే రాసి, స్వరాలు సమకూర్చటంతో పాటు పాట కూడా స్వయంగా పాడారు. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు ఈ గీతాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:కరోనాపై మెగాస్టార్ చిరంజీవి-నాగార్జున పాట