తెలంగాణ

telangana

ETV Bharat / city

నెదర్లాండ్స్​​ నుంచి మమ్మల్ని తీసుకెళ్లండి..! - నెదర్లాండ్స్​లో చిక్కుకున్న తెలుగు ప్రజలు

నెదర్లాండ్స్​లో చిక్కుకున్న ప్రజలను స్వస్థలాలకు చేర్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని నెదర్లాండ్స్​ తెలుగు కమ్యూనిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ సీఎస్​కు లేఖలు పంపారు.

నెదర్లాండ్​ నుంచి మమ్మల్ని తీసుకెళ్లండి..!
నెదర్లాండ్​ నుంచి మమ్మల్ని తీసుకెళ్లండి..!

By

Published : Jun 4, 2020, 5:09 AM IST

Updated : Jun 4, 2020, 5:27 AM IST

లాక్​డౌన్​ కారణంగా నెదర్లాండ్స్​​లో 140 మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. ఇక్కడి తెలుగు ప్రజలు వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లలేక చిక్కుకుపోయిన వారికి నెదర్లాండ్స్​ తెలుగు కమ్యూనిటీ మద్దతుగా నిలుస్తోంది. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్ల కోసం భారత రాయబార కార్యాలయం సంప్రదిస్తున్నట్టు సంఘం నిర్వాహకులు చెబుతున్నారు.

స్వదేశానికి తీసుకువచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వా మద్దతు చాలా అవసరమని ఎన్​ఎల్​టీసీ సీఈవో గుమ్మడి పవన్​ తెలిపారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి, తెలంగాణ సీఈవో సోమేష్​ కుమార్​కు లేఖలు పంపినట్టు సంఘం తరఫున దౌత్య వ్యవహారాలు పర్యవేక్షించే శ్రీనాథ్​ పరాంకుశం వెల్లడించారు. దేశం కానీ దేశంలో చిక్కుకున్న తెలుగు ప్రజలను తీసుకువచ్చేందుకు సహకరించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డీజీసీఏ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విమానం దిగేందుకు అనుమతు కావాల్సి ఉందని సంఘం సభ్యుడు వెంకట్రాజు చెప్పారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో పెరిగిపోయిన రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్

Last Updated : Jun 4, 2020, 5:27 AM IST

ABOUT THE AUTHOR

...view details