తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS MPs in Parliament Today: 'ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇస్తే మా రైతులకు చెబుతాం' - Telangana in Parliament

TRS MPs in Parliament Today: ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస ఐదో రోజు లోక్‌సభలో డిమాండ్‌ చేసింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని తెరాస లోకసభాపక్షనేత నామ నాగేశ్వర రావు అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే మాట్లాడేందుకు అవకాశం కల్పించానన్న స్పీకర్‌.... లోక్‌సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని సూచించారు.

TRS MPs in Parliament, telangana in parliament, పార్లమెంట్​లో తెలంగాణ, పార్లమెంట్​లో తెరాస
పార్లమెంట్​లో తెరాస నిరసన

By

Published : Dec 3, 2021, 2:22 PM IST

పార్లమెంట్​లో తెరాస నిరసన

TRS MPs in Parliament Today : ధాన్యం సేకరణపై తడవకో మాట చెబుతోన్న కేంద్రం స్పష్టతమైన ప్రకటన చేయాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. యాసంగి సాగుకు సమయం ఆసన్నమైందని.. ఏ పంట వేయాలో అర్థంగాక రైతులు అయోమయంలో ఉన్నారని అన్నారు. తెలంగాణలో కర్షకులంతా రోడ్లపైకి వచ్చారని తెలిపారు. యాసంగిలో వరి సాగు చేస్తే కొనుగోలు చేస్తారో లేదోనన్న భయంతో ఇంకా సాగు పనులు మొదలుపెట్టలేదని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టతనిస్తే.. తదుపరి కార్యాచరణను తెలంగాణ రైతులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.

Parliament Winter Sessions 2021 : "ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్‌ సోమేశ్ కుమార్, తెలంగాణ మంత్రులు, ఎంపీలు దిల్లీకి వచ్చి కేంద్రమంత్రితో అనేకసార్లు చర్చించారు. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయమని అడిగారు. గత ఐదు రోజులుగా లోక్​సభలో మేమంతా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. కానీ మా గోడు ఎవరికీ పట్టడం లేదు. ఎంత కొంటారో చెబితే దాన్నిబట్టి మా రైతులకు చెబుతాం. ఇది కేవలం తెలంగాణ సమస్య మాత్రమే కాదు.. దేశ సమస్య. ధాన్య సేకరణపై కేంద్రం ఓ జాతీయ విధానం తీసుకురావాలి."

- నామ నాగేశ్వరరావు, తెరాస ఎంపీ

Paddy Procurement in Telangana : ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని నామ నాగేశ్వర రావు అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే మాట్లాడేందుకు అవకాశం కల్పించానన్న స్పీకర్‌.... లోక్‌సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని సూచించారు.

ఇవీ చదవండి:

MP Nama in Lok Sabha: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని లోక్‌సభలో తెరాస డిమాండ్‌ చేసింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు.. తెలంగాణలో రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి సమస్య నెలకొందని నామ అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్​ వన్​గా ఉందని ఆయన పేర్కొన్నారు. ధాన్యం సేకరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించడం లేదని.. కొద్ది రోజుల క్రితమే సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ధాన్యం సేకరణపై పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస ఎంపీలు డిమాండ్‌ చేశారు.కేంద్ర ప్రభుత్వం రైతులతో రాజకీయం చేస్తోందని మండిపడ్డ ఎంపీలు... వరి రైతుల ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details