Harish comments on BJP: రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగి కించపరచడం.. దుష్ప్రచారం చేసేలా సామాజిక మాధ్యమాల యంత్రాంగాన్ని ప్రోత్సహించడం భాజపాకు బాగా తెలిసిన విద్య అని మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. భాజపా నేతలపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై హరీశ్ స్పందించారు.
భాజపా తన ప్రజా వ్యతిరేక చర్యలతో తెరాసను అడ్డుకోవాలనుకుంటే పొరపాటేనని అన్నారు. ఎవరకీ బెదరబోమన్న హరీశ్.. రాతిగోడ తరహాలో ఎవరూ బద్ధలు కొట్టలేనంత దృఢంగా తెరాస ఉందని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ తనయుడిపై మల్లన్న కామెంట్స్
తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానల్‌లో నిర్వహించిన ఓ పోల్‌లో తన కుమారుడిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ స్పందిస్తే ఊరుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి నీచంగా వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని వ్యాఖ్యానించారు. భాజపా నేతలు ఇదే నేర్పిస్తున్నారా? అని ఆ పార్టీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రశ్నించారు.
అసాంఘిక ప్రవర్తన
వాక్ స్వాతంత్య్రం ఉంది కదా అని... ఇష్టారీతిని మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అసాంఘిక ప్రవర్తనకు, నిరాధార ఆరోపణలతో విషప్రచారానికి సామాజిక మాధ్యమాలు స్వర్గధామంగా తయారయ్యాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:ఒమిక్రాన్ భయాలు- 10 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలు