తెలంగాణ

telangana

ETV Bharat / city

మితిమీరిన రసాయన ఎరువుల వాడకం.. తగ్గుతున్న భూసారం - Decreased crop productivity with pollution in the world

Decreased crop productivity: మానవ చర్యల వల్ల పుడమిసారం కోల్పోతోంది. సాగు భూమి తగ్గిపోతోంది. భారత్‌ సహా దక్షిణాసియా దేశాల్లోని 41 శాతం వ్యవసాయ భూములు సారం కోల్పోయాయి. ఈ ప్రాంతంలో 18 కోట్ల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది’’ అని ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన ‘ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ’(ఎఫ్‌ఏఓ) తన అధ్యయనంలో వెల్లడించింది. ‘‘ఆహారం, వ్యవసాయం కోసం వినియోగించే భూమి, నీటివనరుల పరిస్థితి-2021’ అనే పేరుతో అధ్యయనం వివరాల నివేదికను తాజాగా విడుదల చేసింది.

Decreased crop productivity due to pollution
తగ్గుతున్న భూసారం

By

Published : Dec 13, 2021, 8:11 AM IST

Decreased crop productivity: కాలుష్యం కారణంగా ప్రపంచంలో ఉన్న మొత్తం 152.70 కోట్ల హెక్టార్ల పంట భూముల్లో 49 శాతం నిస్సారంగా మారిందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్​ఏఓ) వెల్లడించింది. రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వినియోగంతో పంట పొలాలు క్రమంగా భూసారాన్ని కోల్పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యవసాయంతో పాటు, దానికి వినియోగిస్తున్న భూములు, నీటి వనరుల పరిస్థితుల వివరాలు, తలసరి లభ్యత తదితరాలను వివరించింది.

ముఖ్యాంశాలు

  • పంటల సాగుకు భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. 2000-18 మధ్యకాలంలో తలసరి నీటివనరుల లభ్యత ప్రపంచ సగటు 20 శాతం తగ్గింది. 2018లో ప్రపంచంలో 820 క్యూబిక్‌ కిలోమీటర్ల భూగర్భ జలాలను పంటలకు వాడారు. ఈ వినియోగం 2010తో పోలిస్తే 2018లో 19 శాతం అదనంగా పెరిగింది.
  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల వ్యవసాయం నుంచి విపరీతంగా కాలుష్యం వెలువడుతోంది. 475 కోట్ల హెక్టార్ల భూమి పాడిపంటలకు వినియోగిస్తున్నారు. ఇందులో పంటలు సాగవుతున్న భూమి దాదాపు 152.70 కోట్ల హెకార్లే ఉంది. అధికంగా వెలువడే కాలుష్య ఉద్గారాలు, అధిక కాలుష్యం వల్ల పంటల ఉత్పాదకత పెరగడం లేదు.
  • Decreased crop productivity due to pollution: శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల వ్యవసాయ భూమి రాన్రాను తగ్గుతోంది. జనాభా పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలసరి సాగు యోగ్యమైన భూమి 2000 నుంచి 2017 మధ్య 20 శాతం తగ్గింది.
  • పర్యావరణాన్ని కలుషితం చేసే లక్షల టన్నుల విషవాయువులు నిత్యం గాలిలోకి విడుదలవుతున్నాయి. ఒక్క 2019లోనే ఇలా విడుదలైన వాయువులు 5400 కోట్ల టన్నుల ‘బొగ్గుపులుసు వాయువు’(సీఓ2)కి సమానం అని ఎఫ్‌ఏఓ వెల్లడించింది. ఇందులో 31 శాతం వ్యవసాయం వల్ల విడుదలైనవే.
  • భవిష్యత్తులో భూమి, నీరు, భూసార పరిరక్షణపైనే వ్యవసాయోత్పత్తుల పెంపు ఆధారపడి ఉంటుంది. భూసారాన్ని కాపాడుకునేందుకు సాంకేతిక పరిష్కారాలను చూపుతూ సాగునీటి కొరతను అధిగమించాలి. సహజ వనరుల కేటాయింపు, వినియోగంపై ప్రభుత్వాలు పాలనాదక్షత చూపాలి.

ఇదీ చదవండి:రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్- మధ్యాహ్నానికి రూ.కోటి జాక్​పాట్

ABOUT THE AUTHOR

...view details