AICC review on membership: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఉదయం దిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్లతో ఏఐసీసీ అధికార ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అమలు తీరును కేసీ.. రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9 నాటికి 30వేల మంది సభ్యత్వ నమోదు సమన్వయకర్తల నియామకం పూర్తి చేయాలని వేణుగోపాల్ పీసీసీకి స్పష్టం చేశారు.
ఈ నెల 9 నుంచి జనవరి 26 లోపు... నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కేసీ ఆదేశించారు. సభ్యత్వ నమోదు విషయంలో అలసత్వం వద్దని.. గ్రామాల వారీగా దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదులో అన్ని స్థాయిల నాయకులను భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు.
సభ్యత్వం ఉంటే బీమా