Telugu Mahilala Protest: ఏపీ మహిళా కమిషన్ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 'జగన్ పాలనలో ఊరికో ఉన్మాది' పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అందించారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని కమిషన్ ఛైర్‌పర్సన్ పద్మ తెలిపారు.
వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించి, నిరసనలు తెలిపారు. తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు లేదని తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో విజయవాడ అత్యాాచార బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
"కమిషన్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు 30 మంది వచ్చాం. కమిషన్‌కు ఫిర్యాదు చేసే హక్కు మాకుంది. ఆస్పత్రిలో అత్యాచారం కేసులో తీసుకున్న చర్యలు ఏమిటి? -వంగలపూడి అనిత, తెెెలుగు మహిళ అధ్యక్షురాలు
బొండా ఉమ ఆగ్రహం:మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వదిలేసి బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం నాయకులకు నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు లేదని బొండా ఉమ అన్నారు. తెలుగు మహిళ నాయకులతో కలిసి విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందచేశారు. మహిళా కమిషన్ ఛైర్మన్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడంలో ఉన్న శ్రద్ధ, బాధితులను ఆదుకోవడం, నిందితులను శిక్షించడంలో పెడితే బాగుంటుందని హితవు పలికారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు..మహిళలపై అఘాయిత్యాలను నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఆడబిడ్డలకు రక్షణ కావాలి..జగన్ పాలన పోవాలంటూ.. నినాదాలతో కదంతొక్కారు. బాధితులకు న్యాయం చేయాలి.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు..
వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత ఇదీ చదవండి:KTR in TRS Plenary: 'కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారు'
మే 2 నుంచి మోదీ ఫారిన్ టూర్- 3 దేశాల్లో సుడిగాలి పర్యటన