తెలంగాణ

telangana

ETV Bharat / city

'హుజూర్​నగర్​ గెలుపుతో తెదేపాకు పునరుజ్జీవనం పోయాలి'

తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని గెలిపించి పార్టీ పునరుజ్జీవానికి నాంది కావాలని ఆయన ఆకాక్షించారు.

'హుజూర్​నగర్​ గెలుపుతో తెదేపాకు తెలంగాణలో పునరుజ్జీవనం పోయాలి'

By

Published : Oct 17, 2019, 11:18 PM IST

తెలంగాణలో తెదేపాను బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లడం వల్ల కేడర్​లో కొంత ఇబ్బందులు వచ్చాయని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ చారిత్రక అవసరం తెలంగాణలో ఉందన్న ఆయన.... ఉత్తర తెలంగాణలో బలహీన పడినా, దక్షిణ తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్నారు. 2014 ఎన్నికల్లో 15 సీట్లు గెలిచి 22 శాతం ఓట్లు సాధించామని గుర్తుచేసిన ఆయన తెలంగాణలో పార్టీ బలోపేతానికి నాయకత్వం, కేడర్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి విజయం ఖాయమని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్​ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన పొలిట్​బ్యూరో సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో పార్టీ నియమావళి ఏవిధంగా ఉండాలనే అశంపై లోతుగా చర్చించినట్లు రావుల తెలిపారు. ప్రతి శనివారం చంద్రబాబు హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్​కు వస్తుండడం వల్ల కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారు.

'హుజూర్​నగర్​ గెలుపుతో తెదేపాకు తెలంగాణలో పునరుజ్జీవనం పోయాలి'

ABOUT THE AUTHOR

...view details