ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా నేతల వ్యాఖ్యలపై.. వైకాపా శ్రేణులు భగ్గుమన్నాయి. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి దిగాయి. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తెదేపా కార్యాలయాలపై దాడులకు దిగి.. విధ్వంసం సృష్టించారు. అయితే అధికార పార్టీ దాడులను ఖండిస్తూ.. తెలుగుదేశం పార్టీ బుధవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది.
కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్లో మాట్లాడారు. దాడుల విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిణామాలు వివరించారు. కేంద్ర బలగాల సాయం కోరారు. బలగాలు పంపేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెదేపా నేతలు తెలిపారు.
పార్టీ కార్యాలయానికి చంద్రబాబు