తెలంగాణ

telangana

ETV Bharat / city

Tamanna Simhadri : సెలబ్రిటీలు పబ్‌లకు వెళ్లడం తప్పా? - నిహారికకు తమన్నా సింహాద్రి మద్దతు

Tamanna Simhadri : రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు విషయంపై తెలుగు బిగ్‌బాస్ ఫేం తమన్నా సింహాద్రి స్పందించారు. సినీ నటి నిహారికకు మద్దతు తెలుపుతూ సెలబ్రిటీలు పబ్‌లకు రావడమే తప్పా అని ప్రశ్నించారు. ఆరోజు నిహారిక మిత్రుల పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిందని.. అనవసరంగా మీడియాలో ఆమెపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు

Tamanna Simhadri
Tamanna Simhadri

By

Published : Apr 7, 2022, 8:45 AM IST

Tamanna Simhadri : సెలబ్రిటీలు పబ్‌లకు రావడమే తప్పా? ఒకరు తప్పు చేస్తే అది అందరికీ ఆపాదిస్తారా? అంటూ బిగ్‌బాస్‌ ఫేం తమన్నా సింహాద్రి సామాజిక మాధ్యమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని పబ్‌పై దాడి ఘటనలో సినీ నటి నిహారికను తరచూ చూపుతూ వీడియోలు ట్రోల్‌ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మిత్రుల పుట్టినరోజు వేడుకలకు నిహారిక వెళ్లిందని, ఈ విషయం పక్కనబెట్టి సామాజిక మాధ్యమాల్లో ఆమె వీడియోలు, ఫొటోలు ప్రసారం చేయడం అభ్యంతరకరమన్నారు.

ABOUT THE AUTHOR

...view details