Traffic Fines in Hyderabad: హైదరాబాద్లో మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. గతంలో హెల్మెట్ లేకపోతే రూ.100 జరిమానా. ప్రస్తుతం 3 నెలల వ్యవధిలో హెల్మెట్ లేకుండా మూడుసార్లు పట్టుపడితే మొదటిసారి రూ.100 రెండోసారి రూ.200 మూడోసారి రూ.500 జరిమానా వేస్తున్నారు. వాహనదారులకు నిబంధనల ఉల్లంఘనల అమలు విషయంలో చైతన్యం తీసుకురావడం కోసమే ఇలా చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
ట్రాఫిక్ జరిమానాల బాదుడు.. మూడుసార్లు చిక్కితే ఇంక అంతే.. - ట్రాఫిక్ జరిమానాల బాదుడు
Traffic Fines in Hyderabad: హైదరాబాద్ పరిధిలో మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. ఇటువంటి వారికి 400 శాతం అదనంగా జరిమానా విధిస్తున్నారు. మొదటిసారి దొరికితే నిర్ణయించిన మేరకే జరిమానా విధిస్తున్న పోలీసులు మరో రెండుసార్లు అదే ఉల్లంఘన మీద దొరికితే మాత్రం మళ్లీ కోలుకోలేని విధంగా అతని నుంచి జరిమానా వసూలు చేయడం చర్చనీయాంశమైంది.
ప్రమాదాలు తగ్గించాలని..ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల 290 మంది చనిపోతున్నారు. ఈ సంఖ్యను కనీసం వందకు తగ్గించాలన్నది పోలీసుల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉన్నా ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో జరిమానా విషయంలో మరింత కఠినంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై నిర్ణయం తీసుకోవడమే తరువాయి వెంటనే అమలులోకి తెచ్చారు. ఇతర ఉల్లంఘనలకు సంబంధించి కూడా ఇదే తరహాలో వడ్డిస్తున్నారు. వారం రోజులుగా ఇలా దాదాపు 50 వేలమంది వాహనదారులపై ఇప్పటికే జరిమనాను విధిస్తూ చలాన్లు జారీ చేసినట్లు క్షేత్రస్థాయిలో విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇదే సమయంలో మొదటిసారి వేసిన చలానాకు సంబంధించి జరిమానా మొత్తం చెల్లిస్తే అలాంటి వారికి విధించడం లేదు. జరిమానా చెల్లించని వారికి మాత్రమే 400 శాతం అధికంగా విధిస్తున్నారు. మరోవైపు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న దాదాపు 200 మందిపై ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసి వాహనదారులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఏటా నమోదవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు 40 లక్షలుగా ఉంటే.. ఇందులో శిరస్త్రాణానికి సంబంధించినవి 29 లక్షలు ఉన్నాయి.
ఇవీ చదవండి: