Telangana Rain Today: కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ గాలుల్లో అస్థిరత కారణంగా 1500 మీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 128 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా జక్రాన్‌పల్లి(నిజామాబాద్ జిల్లా)లో 7, ధరూర్(జోగులాంబ గద్వాల)లో 5, కనగల్(నల్గొండ)లో 4, రాయికోట్(సంగారెడ్డి)లో 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం అత్యధికంగా ఆళ్లపల్లి(భద్రాద్రి జిల్లా)లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు! - తెలంగాణకు భారీ వర్ష సూచన
Telangana Rain Today: వాతావరణంలో అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
Telangana Rain Today