బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెండు, మూడు రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
నిన్న మరట్వాడ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాాబాద్ వాతారవణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ద్రోణి ఈరోజు బికనూర్, జయపుర, గుణా, సియోని, గొందియా, గోపాల్ పూర్, వాయువ్య పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరంలోని అల్పపీడనం మీదగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళా ఖాతం వరకు కొనసాగుతుందని తెలిపారు.