తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వానికి గిడ్డంగుల సంస్థ నుంచి రూ.5 కోట్ల డివిడెండ్ - telangana marketing minister niranjan reddy

2019-2020 ఏడాదికి సంబంధించి తెలంగాణ గిడ్డంగుల సంస్థ లాభాల నుంచి రూ.5 కోట్ల డివిడెండ్​ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్​ సామేలు ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంత్రి నిరంజన్ రెడ్డికి చెక్కును అందజేశారు.

minister niranjan reddy
మంత్రి నిరంజన్ రెడ్డి

By

Published : Oct 20, 2020, 10:18 AM IST

దేశంలోనే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ.. ఆక్యుపెన్సీలో ప్రథమ స్థానంలో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 2019 - 2020 సంవత్సరానికి సంబంధించి గిడ్డంగుల సంస్థ లాభాల నుంచి 5 కోట్ల రూపాయల డివిడెండ్ రాష్ట్ర ప్రభుత్వానికి లభించిందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేలు నేతృత్వంలోని అధికారుల బృందం మంత్రి నిరంజన్​ రెడ్డికి ప్రభుత్వ వాటా కింద రూ.5 కోట్ల చెక్కును అందజేశారు.

2019 - 2020కి గాను సొంతంగా 27, వ్యవసాయ మార్కెట్ కమిటీవి 194, ఇన్వెస్టర్ గోడౌన్లు 54, ప్రైవేటు గోడౌన్లు 5, మొత్తం 280 గోడౌన్లలో 22.88 లక్షల మెట్రిక్ టన్నుల మేర వ్యవసాయోత్పత్తుల సరకుల నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల సౌకర్యార్థం.. గోదాముల సామర్థ్యం పెంపొందిస్తున్న క్రమంలో.. మొత్తం 102 శాతం ఆక్యుపెన్సీతో 83.12 కోట్ల రూపాయల వరకు లాభాలు ఆర్జించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరాచారి, ఎస్ఈ సుధాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details