Minister Ktr news: సంసద్ గ్రామీణ యోజనలో దేశంలో తొలి 10 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ మేరకు గ్రామాల జాబితాను కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి 20 స్థానాల్లో 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నాయని మంత్రులు పేర్కొన్నారు. పల్లెప్రగతి లాంటి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు.
'సంసద్ గ్రామీణ యోజనలో తొలి 10 స్థానాల్లో తెలంగాణవే. దేశవ్యాప్తంగా 10 స్థానాల్లో రాష్ట్రానికి చెందిన గ్రామాలే ఉండడం గర్వకారణం. తొలి 20 స్థానాల్లో 19 తెలంగాణ గ్రామాలు ఉన్నాయి. సీఎం ఆలోచన, పల్లెప్రగతి వల్లే ఇది సాధ్యమైంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ బృందానికి అభినందనలు.'-కేటీఆర్
Minister Errabelli news: యాదాద్రి జిల్లా వాడపర్తి దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా... కరీంనగర్ జిల్లా కొండాపూర్, నిజామాబాద్ జిల్లా పల్డా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రామకృష్ణాపూర్, యాదాద్రి జిల్లా కొలనుపాక, నిజామాబాద్ జిల్లా వెల్మల్, జగిత్యాల జిల్లా మూలరాంపూర్, నిజామాబాద్ జిల్లాలోని తానా కుర్ద్, కుక్నూర్, కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి మొదటి పదిస్థానాల్లో నిలిచాయి.