నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇరాక్‌లో చిక్కుకున్న 16 మంది తెలంగాణవాసులు హైదరాబాద్ చేరుకున్నారు. బాధితులు తమ గోడును సామాజిక మాధ్యమాల్లో మంత్రి కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన కేటీఆర్ వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. ఇరాక్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించి వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న వారు.. ఈ రోజు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో శంషాబాద్ చేరుకున్నారు.
ఇరాక్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ బాధితులు - నకిలీ ఏజెంట్లు
నకిలీ ఏజెంట్ల మోసంతో ఇరాక్‌లో చిక్కుకున్న 16మంది హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రి కేటీఆర్... భారత విదేశాంగ శాఖ సహాయంతో ఇరాక్ లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించి వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇరాక్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ బాధితులు
తమ బాధను అర్థం చేసుకుని వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించిన మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. వీరందరిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు కూడా ప్రభుత్వాధికారులు సౌకర్యాలు కల్పించారు.
ఇవీ చూడండి:'వజ్ర'లను అమ్మే యోచనలో ప్రభుత్వం...!