Exams Postponed in Telangana: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈనెల 30 వరకు సెలవులు పొడిగించింది. కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా సెలవులు పొడిగిస్తున్నట్లు నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రకటన చేశారు. సర్కార్ నిర్ణయానికి అనుగుణంగా పలు విశ్వవిద్యాలయాలు చర్యలు తీసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈనెల 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసింది. సెలవుల పొడిగింపు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈనెల 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ప్రకటన చేసింది. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.