తెలంగాణ

telangana

ETV Bharat / city

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ గిరిజన, లంబాడి ఐకాస - tribal jac meet tamilisai

తెలంగాణ గిరిజన, లంబాడి ఐకాస ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిశారు. రాష్ట్రంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై వివరించారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రకారం విచక్షణాధికారాలను ఉపయోగించి గిరిజనుల హక్కులను కాపాడాలని కోరినట్లు మాజీ మంత్రి రవీంద్ర నాయక్‌ తెలిపారు.

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ గిరిజన, లంబాడి ఐకాస

By

Published : Nov 1, 2019, 3:14 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనులను మోసం చేశారని మాజీమంత్రి రవీంద్ర నాయక్‌ ఆరోపించారు.12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి మోసం చేశారన్నారని పేర్కొన్నారు. తెలంగాణ గిరిజన, లంబాడి ఐకాస ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిశారు. రాష్ట్రంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై వివరించినట్లు రవీంద్ర నాయక్‌ వెల్లడించారు. రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కేసీఆర్‌ తుంగలో తొక్కుతున్నాడని దుయ్యబట్టారు. 5వ షెడ్యూల్‌ ప్రకారం విచక్షణాధికారాలను ఉపయోగించి తమ హక్కులను కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ గిరిజన, లంబాడి ఐకాస

ABOUT THE AUTHOR

...view details