తెలంగాణ

telangana

ETV Bharat / city

Hyderabad Traffic: మళ్లీ మళ్లీ అదే తప్పు.. ఉల్లంఘనులపై రవాణా శాఖ కొరడా - Telangana transport department actions on traffic rules violators

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై రవాణాశాఖ కొరడా ఝళిపిస్తోంది. తొలి తప్పు కింద జరిమానాతో విడిచి పెట్టినా సరే. మళ్లీ మళ్లీ అదే తప్పు చేసిన వాహనదారుల లైసెన్సులను ట్రాఫిక్‌ పోలీసుల సిఫార్సుల మేరకు రద్దు చేస్తోంది. అయినా చాలామంది వాహనదారుల్లో మార్పు కన్పించడం లేదు. ఈ తరహా కేసులు ఏటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా తాగి వాహనాలు నడిపిన చాలా మంది లైసెన్సులను ఇప్పటికే రద్దు చేసింది.

ట్రాఫిక్ ఉల్లంఘనులపై రవాణా శాఖ కొరడా
ట్రాఫిక్ ఉల్లంఘనులపై రవాణా శాఖ కొరడా

By

Published : Aug 9, 2021, 9:27 AM IST

గతేడాది హైదరాబాద్‌ ఆర్టీఏ పరిధిలో 901 మంది లైసెన్సులు రద్దు చేయగా ఈ ఏడాది ఇప్పటికే 1,536 మంది ఉల్లంఘనులపై వేటు పడింది. శివార్లను కలుపుకొంటే ఈ సంఖ్య ఎక్కువే. తొలుత 3-6 నెలలు, కొన్నిసార్లు ఏడాదిపాటు లైసెన్సులపై అధికారులు వేటు వేస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్‌ జోన్‌లో ఎక్కువగా రద్దు కేసులు నమోదు అవుతున్నాయి. పబ్‌లు, బార్‌లు, హోటళ్లు ఎక్కువగా ఉండటంతో చాలామంది అక్కడే తాగి తిరిగి వాహనాలపై వస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. తాగి వాహనం నడపటంతోపాటు వ్యతిరేక దిశలో వాహనాలపై రావటం, ఓవర్‌ టేక్‌లు, కట్స్‌ కొట్టడం, నిబంధనలకు విరుద్ధంగా యూటర్న్‌లు తీసుకోవడం లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్నిసార్లు జరిమానాలు వేసినా అదే తీరు కొనసాగుతోంది. దీంతో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల లైసెన్సులపై వేటు వేస్తున్నారు.

ఇబ్బందులు తప్పవు

  • లైసెన్సు రద్దుతో పలు ఇబ్బందులు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. లైసెన్సు లేకుండా వాహనం నడిపి పోలీసులకు దొరికితే జరిమానాతోపాటు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉద్యోగులైతే కెరీర్‌ పరంగా సమస్యలే.
  • లైసెన్సు లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే అది పెద్ద నేరం కింద పరిగణిస్తారు. కేసు నమోదు చేసి జైలుకు పంపవచ్ఛు వాహనం సీజ్‌ చేస్తారు. సొంత వాహనం కాకుండా ఇతరులదైతే సదరు యజమానిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
  • రద్దు చేసిన తర్వాత ఆ వివరాలను సంబంధిత వ్యక్తి పనిచేసే కంపెనీ లేదంటే సంస్థకు అందిస్తారు. ఏ కారణంతో లైసెన్సు రద్దు చేశారో అందులో పేర్కొంటున్నారు. తాగి వాహనం నడిపినట్లైతే కొన్ని కంపెనీలు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఇది కూడా కెరీర్‌ పరంగా చాలా నష్టమే.
  • చాలామంది విదేశాలకు వెళుతుంటారు. ఈ సమయంలో అంతర్జాతీయ లైసెన్సుల తీసుకోవడం సాధారణమే. అయితే ఒకసారి లైసెన్సు రద్దు అయితే అంతర్జాతీయ లైసెన్సు మంజూరు కావడం చాలా కష్టం.

ABOUT THE AUTHOR

...view details