తెలంగాణ

telangana

ETV Bharat / city

Top Ten News: టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News: టాప్​ టెన్​ న్యూస్​ @9PM
Top Ten News: టాప్​ టెన్​ న్యూస్​ @9PM

By

Published : Mar 21, 2022, 8:59 PM IST

  • 'ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు'

CM KCR:కేంద్రం ధాన్యం సేకరణపై అంగీకరించకపోతే తెలంగాణ ఉద్యమ పంథాలో పోరాడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రిని కలుస్తారని... అక్కడ సానుకూల స్పందన రాకుంటే... పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆషామాషీగా కాకుండా కార్యాచరణ మేరకు పోరాటం ఉంటుందన్నారు.

  • ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ

CM KCR on Early Polls: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కచ్చితంగా తెరాస ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలు సర్వే ద్వారా ఇచ్చిన నివేదిక మేరకు.. తెరాస భారీ విజయాన్ని నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

  • 'కచ్చితంగా తెలంగాణ నుంచి రా రైస్ కొనుగోలు చేస్తాం'

Piyush Goyal on Paddy Procurement: రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ స్పష్టం చేశారు. యాసంగిలో కచ్చితంగా తెలంగాణ నుంచి రా రైస్ కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వమే సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • యాదాద్రిలో అద్భుతఘట్టానికి అంకురార్పణ

Yadadri Temple News : అద్భుత కట్టడం.. దివ్యక్షేత్రం.. సుప్రసిద్ధ యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు అడుగు ముందుకు పడింది. మహోసంప్రోక్షణలో భాగంగా వారం రోజుల పాటు జరగనున్న యజ్ఞయాగాదులకు రుత్వికులు శ్రీకారం చుట్టారు. ఆగమశాస్త్రానుసారం పంచుకుండాత్మక మాహాయాగానికి అంకురార్పణ చేశారు. బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేక మహారాజాభిషేకం నిర్వహిస్తున్నారు.

  • 18 ఏళ్లు దాటిన వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ డోస్!

Booster Dose in India: దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా బూస్టర్​ డోసులు అందించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి ప్రికాషనరీ డోసుల పేరుతో మూడో డోసును కేంద్రం పంపిణీ చేస్తోంది.

  • ప్రమోద్ సావంత్​కే మళ్లీ గోవా పగ్గాలు

Goa chief minister: గోవా ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమోద్​ సావంత్​ బాధ్యతలు చేపట్టనున్నారు. పనాజీలో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ప్రమోద్​ సావంత్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేతలు. కేంద్ర పరిశీలకులుగా తోమర్​, మురుగన్ హాజరయ్యారు. ఈనెల 25వ తేదీలోపు ప్రమాణ స్వీకారం ఉండనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • చైనాలో కుప్పకూలిన విమానం

China Plane crash: చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న ప్రయాణికుల విమానం గువాంగ్​షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. చైనా ఈస్టర్​ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్​ 737 విమానం.. కున్​మింగ్​ నుంచి గువాంగ్​ ఝౌకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాంతీయ విపత్తు స్పందన విభాగం వెల్లడించింది.

  • రష్యా డిమాండ్​ను లైట్​ తీసుకున్న ఉక్రెయిన్

Mariupol Ukraine News: ఉక్రెయిన్​ పోర్టు నగరం మరియుపోల్​లోని బలగాలు ఆయుధాలు కిందపడేసి.. లొంగిపోవాలన్న రష్యా డిమాండ్​ను ఉక్రెయిన్​ తిరస్కరించింది. ఉక్రెయిన్ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఆ దేశ ఉపప్రధాని ఇరినా వెరెశ్​చక్ తేల్చిచెప్పారు.

  • స్విస్​ ఓపెన్​కు రంగం సిద్ధం

Swiss Open 2022: స్విస్​ ఓపెన్​ బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం(మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఈ మెగాఈవెంట్​లో టైటిల్ ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్​.. సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నారు. కాగా, భారతయువ కెరటం లక్ష్యసేన్‌ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.

  • 'ది కశ్మీర్​ ఫైల్స్​'.. ఆమిర్​ ఖాన్​ ఏమన్నారంటే?

The Kashmir Files Aamir khan: 'ది కశ్మీర్​ ఫైల్స్​' సినిమాను ప్రతీ భారతీయుడు తప్పకుండా వీక్షించాలని అన్నారు స్టార్ హీరో ఆమీర్​ ఖాన్​. ఈ సినిమా విజయం సాధించినందుకు ఎంతో ఆనందిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details