ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఅశ్రునయనాల మధ్య అరుణతారకు తుది వీడ్కోలు Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు.. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతిపై పలువురు రాజకీయవేత్తలు, పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం నల్గొండలోని జిల్లా సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్రగా భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించారు.ఈటలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు భాజపా నేతలు, ఈటల అభిమానులు బర్త్ డే విషెస్ చెప్పారు.వాయుగుండంగా మారిన అల్పపీడనం Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రం వద్ద నేడు వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపింది.పొలానికి వెళ్లిన బాలికపై.. మద్యం తాగించి గ్యాంగ్‌రేప్!Gujarat Girl Gang Raped: పొలానికి వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి.. మద్యం తాగించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. మరో ఘటనలో రైల్వే స్టేషన్లో టాయిలెట్‌కు వెళ్లిన మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.కాంగ్రెస్‌పై ఆజాద్ సంచలన వ్యాఖ్యలు Ghulam Nabi Azad on Kashmir Files: ప్రజలను కులం, మతం వంటి పలు అంశాల ఆధారంగా విభజించటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయని, అందులో సొంత పార్టీ సైతం ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని నొక్కిచెప్పారు.'8-16 వారాల మధ్య కొవిషీల్డ్ రెండో డోస్'Covishield Vaccine Gap: కొవిషీల్డ్ టీకా రెండో డోసును.. మొదటి డోసు తీసుకున్న తర్వాత 8-16 వారాల మధ్యలో ఇవ్వొచ్చని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) ప్రతిపాదించింది. పలు దేశాల్లో కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రానికి ఈ సిఫార్సులు చేసింది ఎన్‌టీఏఐజీ.మణిపుర్ సీఎంగా మళ్లీ బీరేన్ సింగ్ Biren Singh: మణిపుర్ ముఖ్యమంత్రిగా మరోసారి బీరేన్ సింగ్ ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ భాజపా ఘనవిజయం సాధించింది.కోడి గుడ్డు రూ.35, లీటర్ పెట్రోల్ రూ.283Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. చికెన్, బియ్యం, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు అన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు విపరీతంగా పెరగగా.. శ్రీలంకలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.283 రూపాయలకు చేరగా.. లీటర్ డీజల్‌ను రూ.220కి విక్రయిస్తున్నారు. 1990 సంక్షోభం కంటే మరింత దారుణమైన పరిస్థితులు శ్రీలంకలో ఉన్నట్లు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు అత్యధిక వికెట్ల వీరుడు.. ఇప్పుడు నెట్‌బౌలర్‌గా.. IPL 2022: ఐపీఎల్లో ఒకప్పుడు అతడు ఒక స్టార్ బౌలర్. తన బౌలింగ్‌తో బ్యాటర్లకు చెమటలు పట్టించి ఓ సీజన్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.ఈ సారి ఐపీఎల్ మెగా వేలంలో అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కాగా, ఈ స్టార్ బౌలర్‌ను ప్రస్తుతం ఐపీఎల్లో ఓ జట్టు నెట్ బౌలర్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఇంతకీ అతడెవరంటే?రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోన్న 'పెన్నీ' సాంగ్కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట', 'గాలివాన', 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్‌కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.