తెలంగాణ

telangana

ETV Bharat / city

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @1PM
top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @1PM

By

Published : Mar 4, 2022, 12:59 PM IST

  • రాంచీలో సీఎం కేసీఆర్​

దిల్లీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కణ్నుంచి ఝూర్ఖండ్‌ రాజధాని రాంచీకి బయలుదేరారు. గల్వాన్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించి.. వారికి గతంలో ప్రకటించిన ఆర్థికసాయం అందించనున్నారు. రాంచీలోని ఇద్దరు అమరజవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక మిగతా రాష్ట్రాల అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం చెక్కులు అందజేయనున్నట్లు సమాచారం.

  • మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు

Minister Srinivas goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్‌ విభాగం నిర్ణయించింది. హత్య కుట్ర కోణం బయట పడటంతో భద్రత పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిల్లీ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్‌ రాగానే అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరనున్నారు.

  • రిమాండ్​ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

Remand Report on Minister Murder Conspiracy case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసుకు సంబంధించి రిమాండ్​ రిపోర్టులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కౌన్సిలర్ టికెట్ రాకుండా అడ్డుకున్నాడని మంత్రిపై మున్నూరు రవి కక్ష పెంచుకున్నాడని.. వ్యాపారపరంగా నష్టం చేకూర్చాడని కక్షతో ఉన్న రాఘవేందర్ రాజు, నాగరాజు మంత్రి హత్యకు కుట్ర పన్నారని పోలీసులు రిమాండ్​ రిపోర్టులో వెల్లడించారు.

  • తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు..

S3V Vascular Technologies Investments in Telangana: తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వ్యాస్క్యులార్ టెక్నాలజీస్ రూ.250కోట్ల పెట్టుబడితో మెడికల్ డివైజెస్ పార్క్​లో తమ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

  • రెండో రోజు రైతుల మహా పాదయాత్ర

Farmers Maha Padayatra: రైతు వేదిక నిజామాబాద్ జిల్లా, రైతు ఐక్యకార్యాచరణ సమితి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలోని కమ్మర్​పల్లి నుంచి నేడు యాత్ర ప్రారంభమైంది. మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తెరిపించాలని రైతులు డిమాండ్​ చేశారు.

  • ఉక్రెయిన్​ పరిణామాలపై ప్రధాని మోదీ మరోసారి సమీక్ష

ఉక్రెయిన్​ సంబంధిత పరిస్థితులు, తాజా పరిణామాలు, భారతీయుల తరలింపు ప్రక్రియ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రులు ఎస్​ జైశంకర్​, పీయూష్​ గోయల్​, జాతీయ భద్రతా సలహాదారు ఎన్​ఎస్​ఏ అజిత్​ డోభాల్​ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • ఉద్యోగులపై జలఫిరంగులు

Employees Protested: కొత్త పింఛన్​ పథకం స్థానంలో పాత పింఛన్​ను అమలులోకి తీసుకురావాలని డిమాండ్​ చేస్తూ హిమాచల్​ ప్రదేశ్​, సిమ్లాలోని అసెంబ్లీ ముందు వెయ్యి మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. అయితే, బారికేడ్లు, జలఫిరంగులను దాటుకుని శాసనసభ ముట్టడి చేపట్టారు ఉద్యోగులు.

  • శునకంతోనే భారత్​కు సేఫ్​గా..

Ukraine Russia War: పెంపుడు కుక్క కోసం ఉక్రెయిన్​లోనే ఉండిపోయిన భారతీయ విద్యార్థి ఎట్టకేలకు స్వదేశానికి వచ్చాడు. శునకాలను కూడా వెంట తెచ్చుకునేందుకు అనుమతి లభించడం వల్ల శుక్రవారం.. హంగేరీ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నాడు.

  • క్రీజులో కోహ్లీ..

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్​ నిలకడగా కొనసాగుతోంది. లంచ్ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది టీమ్​ఇండియా.

  • 'హే సినామిక'.. అంచనాలను అందుకుందా?

Hey Sinamika Review: హీరో దుల్కర్​ సల్మాన్​ నటించిన 'హే సినామిక' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

ABOUT THE AUTHOR

...view details