తెలంగాణ

telangana

By

Published : Feb 24, 2022, 10:59 AM IST

ETV Bharat / city

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @11AM
top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @11AM

  • ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్..

Putin declares war on Ukraine: అనుకున్నదే జరిగింది.. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్​లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్​ ద్వారా ప్రసంగించిన పుతిన్.. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

  • 'యుద్ధ ప్రకటన'పై అమెరికా ఫైర్

రష్యా యుద్ధ ప్రకటనపై అమెరికా స్పందించింది. ఈ దాడుల వల్ల జరిగే నష్టానికి బాధ్యత రష్యాదేనని పేర్కొంది. దీనిపై మిత్ర దేశాలతో కలిసి చర్చించి నిర్ణయాత్మకంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

  • ఉక్రెయిన్​లో వరుస పేలుళ్లు...

Russia Ukraine war: ఉక్రెయిన్​లోని అనేక నగరాలపై దాడులు జరుగుతున్నాయి. రాజధాని కీవ్ సహా కీలక నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. అదే సమయంలోఉక్రెయిన్​ పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీల వెబ్​సైట్లపై సైబర్ దాడులు జరిగాయి.

  • ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. విమాన ప్రయాణాలు బంద్!

రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో.. దేశంలోని తూర్పున ఉన్న నగరాల్లో ఎయిర్​పోర్టులను మూసివేసింది ఉక్రెయిన్. పౌర విమాన ప్రయాణాల కోసం గగనతల వినియోగాన్ని నిషేధించింది. తూర్పు ఉక్రెయిన్​లోని గగనతలాన్ని డేంజర్​ జోన్​గా ప్రకటించింది. రష్యా పలు నగరాలపై దాడులతో విరుచుకుపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.

  • అన్నలకు ఆ తమ్ముడే.. అమ్మానాన్న

Brothers Need Help in Khammam : అమ్మానాన్నలు లేని లోటు తీరుస్తూ.. ఇంటికి చిన్నోడైనా పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ.. అన్నలకు అన్నీతానై ముందుకు నడిపిస్తున్నాడు ఓ యువకుడు. పుట్టుకతో వికలాంకుడైన ఓ అన్నను.. మానసిక రుగ్మతతో పాటు పుట్టుకతోనే అంధుడైన మరో సోదరుడిని తల్లిలా సాకుతున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు.. వయసులో చిన్నవాడైనా భుజాన పెద్ద బాధ్యతను ఎత్తుకున్నాడు. ఇద్దరు అన్నలకు అమ్మానాన్న తానే అయి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఇద్దరు అన్నల్లో ఒకరికి వస్తున్న పింఛన్.. తాను కూలీకి వెళ్తూ సంపాదించిన డబ్బుతోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ప్రభుత్వం దయతలిచి తన మరో అన్నకు పింఛను ఇప్పించాలని.. తాము ఉండటానికి ఓ గూడు కల్పించాలని వేడుకుంటున్నారు ఈ ముగ్గురు అన్నదమ్ములు.

  • వాచ్‌మన్‌ రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుపోయే నిజాలు

YS Viveka Murder Case Update : వై.ఎస్‌. వివేకా హత్య ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వివేకా ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే బి. రంగన్న మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వివేకానందరెడ్డి ఇంటివద్ద రాత్రి కాపలాదారుగా పనిచేసే రాజశేఖర్‌ కాణిపాకం నుంచి ఎప్పుడు వస్తారో ఫోన్‌ చేసి కనుక్కోవాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనను ఆదేశించారని రంగన్న తెలిపారు. ఆయన సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదంటూ.. తన ఫోన్‌ నుంచే రాజశేఖర్‌కు కాల్‌ చేసి మాట్లాడించారని పేర్కొన్నారు. అదే రోజు రాత్రి వివేకా హత్యకు గురయ్యారని చెప్పారు.

  • దేశంలో కొత్తగా 14,148 కరోనా కేసులు

Corona cases: భారత్​లో కొత్తగా 14,148 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 302మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 30,009 మంది కోలుకున్నారు.

  • స్టాక్​ మార్కెట్లపై యుద్ధ ప్రభావం

Stock markets: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు గురువారం కుప్పకులాయి. సెన్సెక్స్​ దాదాపు 1900 పాయింట్లు నష్టపోగా... నిఫ్టీ 500 పాయింట్లకుపైగా పతనమైంది.

  • కోహ్లీ, షోయబ్ రికార్డుకు చేరువలో రోహిత్​

IND VS SL first T20 Rohith record: భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ తన ఖాతాలో మరో రెండు రికార్డులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి శ్రీలంకతో మెుదలయ్యే టీ20 సిరీస్​లో 37 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కునున్నాడు.

  • అజిత్​ 'వలిమై' సోషల్​మీడియా రివ్యూ

Ajith Valimai twitter review: తమిళ స్టార్​ హీరో అజిత్​ నటించిన 'వలిమై' సినిమా నేడు(గురువారం) థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా చూసిన అభిమానులంతా మూవీ అదిరిపోయిందని సోషల్​మీడియా వేదికగా ట్వీట్స్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details