తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM - top ten telugu news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana news in telugu
టాప్​టెన్​ న్యూస్​ @9AM

By

Published : Feb 23, 2022, 8:59 AM IST

  • యూపీలో 4వ దశ పోలింగ్​ ప్రారంభం

ఉత్తర్​ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. మొత్తం 624మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

  • ఉదయమే ఓటేసిన మాయావతి

UP assembly election 4th phase: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.2కోట్లు.. అతడేం చేశాడంటే..?

మనం ఎవరి ఖాతాలోకైనా నగదు జమ చేస్తున్నప్పుడు.. ఖాతా నంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్లో.. సాంకేతిక సమస్య వల్లనో.. అప్పుడప్పుడు.. పొరపాటుగా అది వేరే వారి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఖాతాలోకి ఏకంగా రూ.2 కోట్లు జమయ్యాయి. మరి అప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా..?

  • హింసను అదుపు చేయలేకపోతోంది

హింస ఏ రూపంలో ఉన్నా తాము సహించమని, తప్పక ఖండిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కర్ణాటకలో భాజపా సారథ్యంలో అసమర్థ ప్రభుత్వం ఉన్నందునే.. అక్కడ మతపరమైన హింసను అదుపు చేయలేకపోతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

  • అవసరాలే ప్రాతిపదికగా వైద్య సీట్ల కేటాయింపు

రాష్ట్రంలో సర్కార్ దవాఖానాల్లోని అవసరాలనే.. ప్రాతిపదికగా తీసుకుని హేతుబద్ధంగా పీజీ సీట్లను కేటాయించాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్‌సర్వీస్ కోటా విధానాన్ని మార్చాలని యోచిస్తోంది. ఇన్‌సర్వీస్‌ కోటాలో పీజీ పూర్తి చేసి, తిరిగి ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న 290 మంది స్పెషలిస్టు వైద్యులకు ఈనెల 23, 24 తేదీల్లో కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

  • రంగంలోకి ఉక్రెయిన్ రిజర్వ్ బలగాలు

ఉక్రెయిన్​లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా బలగాలను మోహరించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెలెన్‌స్కీ అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో దేశంలోని రిజర్వ్ భద్రతాబలగాలను సిద్ధం చేస్తున్నట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ప్లాన్​ ఏ విఫలమైతే.. ప్లాన్​బీతో దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా తెలిపారు.

  • త్వరలో మళ్లీ చైనాకు భారత విద్యార్థులు

బీజింగ్‌ విధించిన నిషేధంతో రెండేళ్లుగా భారత్‌లోని ఇళ్ల వద్దే ఉండిపోయిన దాదాపు 23 వేలమంది భారత విద్యార్థులు త్వరలో చైనాకు వెళ్లనున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి చైనా హామీ ఇచ్చింది.

  • త్వరలో పెట్రోల్ రేట్ల మోత.. బండి తీయలేమా?

అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరువవుతోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వార్తలు ఈ ధరల మంటకు ఆజ్యం పోస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత 110 రోజులుగా దేశంలో పెట్రోల్ రేట్లలో మార్పు లేదు. కాబట్టి, మార్చిలో రేట్ల మోత తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • కష్టాలు, సవాళ్లను అధిగమించి.. విజేతలుగా

టీమ్‌ఇండియా.. అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించి యావత్‌ దేశ ప్రశంసలను అందుకుంది. ఈ టోర్నీలో తమకెవరూ సాటిలేరని నిరూపించుకుంది. అయితే ఈ విజయం వెనుక మన కుర్రోళ్ల కష్టం చాలానే దాగి ఉంది. మైదానంలోనే కాదు.. మైదానం వెలుపలా ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొంది.

  • 'భీమ్లానాయక్‌' ప్రీ రిలీజ్‌.. ఫ్యాన్స్​కు పోలీసులు సూచనలు

రిలీజ్​కు సిద్ధమైన 'భీమ్లానాయక్'​ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్ గ్రౌండ్స్‌ వేదికగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం, అనవసర గొడవలను, తొక్కిసలాటలను నివారించేందుకు పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. అవేంటంటే..

ABOUT THE AUTHOR

...view details