ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23.29 శాతం పీఆర్‌సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.'కేసీఆర్ లాంటి పిరికి సీఎంను ఎక్కడా చూడలేదు' Shivraj Singh Chouhan on KCR: తెలంగాణలో ధర్మయుద్ధం మొదలైందని భాజపా జాతీయ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. బండి సంజయ్ పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడ చూడలేదని ఆయన అన్నారు.ఎంపీ అర్వింద్‌పై చర్యలొద్దు: హైకోర్టు hc on mp Arvind : సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని ఎంపీ అర్వింద్‌ను హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్‌ను కించపరిచే పోస్టులు పెట్టారని బంజారాహిల్స్‌లో అర్వింద్‌పై కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఎంపీ అర్వింద్ హైకోర్టును ఆశ్రయించారు. అతడి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అర్వింద్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.'ఆ ప్రయాణికులకు హోం క్వారంటైన్ తప్పనిసరి' Home Quarantine: భారత్‌కు వచ్చిన ప్రయాణికులకు 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.'పంజాబ్ ఇష్యూ'పై భాజపా నయా గేమ్‌ప్లాన్ BJP nationwide campaign against Congress: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భారీ భద్రతా వైఫల్య వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇదే అజెండాగా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది భాజపా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉద్యమించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు భాజపా నేతలు.ఆ ఏనుగుకు రేషన్ బియ్యం మహా ఇష్టం Elephant Attack in Kerala: కేరళ ఇడుక్కి జిల్లాలోని ఓ ప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. రేషన్ దుకాణాలపై దాడి చేసి.. బియ్యాన్ని తినేస్తుంది. దీంతో బియ్యం అందక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.రోబోతో పెద్దాయన ప్రేమాయణం- త్వరలోనే వివాహం! Love With Humanoid Robot: రోబో.. మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అనడం దర్శకుడు శంకర్ తీసిన సినిమాలో చూశాం. అది కల్పితం. కానీ నిజ జీవితంలో కూడా ఓ మనిషి మరమనిషితో ప్రేమలో పడిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఏకంగా పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి.వారాంతంలో మార్కెట్లకు లాభాలు Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో తీవ్ర ఒడుదొడుకులకు లోనయినా.. చివరకు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 143, నిఫ్టీ 67 పాయింట్ల చొప్పున పెరిగాయి.'జకోవిచ్‌ను నేరస్థుడిలా చూడకండి.. మంచి వసతి కల్పించండి' Novak Djokovic Visa: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసిన అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అతడిని మంచి హోటల్లోకి తరలించాలని సెర్బియా సర్కారు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరింది.నటి స్వర భాస్కర్ సహా స్టార్ సింగర్‌కు కరోనా Swara Bhaskar Covid: బాలీవుడ్లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం మరో ముగ్గురు స్టార్లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారిలో నటి స్వర భాస్కర్, ప్రముఖ సింగర్ విశాల్ దడ్లానీ ఉన్నారు.