ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'వర్ధమాన పాత్రికేయులకు అరుణ్‌సాగర్ ఒక స్ఫూర్తి' ArunSagar Awards 2022: పాత్రికేయ, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఏటా అందజేసే అరుణ్‌సాగర్ ట్రస్ట్ విశిష్ట పురస్కారాల వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. 2022 సంవత్సరానికి గానూ సాహిత్య రంగంలో ప్రముఖ కవి, విమర్శకులు ప్రసాదమూర్తికి విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయగా... పాత్రికేయ రంగంలో ఈనాడు ఏపీ సంపాదకులు మానుకొండ నాగేశ్వర్ రావు విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని అందుకున్నారు.విశాఖలో విషాదంవిశాఖ ఆర్‌కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు గల్లంతవ్వగా.. రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఆదివారం మధ్యాహ్నం ఆర్‌కే బీచ్‌లో స్నానానికి దిగి సరదగా గడిపారు. ఆ సమయంలో పెద్ద కెరటాలు రావటంతో వీరిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. 'బదిలీ ప్రక్రియలో స్థానికత కంటే సీనియార్టీకి ప్రాధాన్యం సరికాదు' MLC Jeevan Reddy Comments: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత బదిలీ ప్రక్రియతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని.. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.'పిల్లలకు కరోనా టీకా- ఈ విషయం మరవొద్దు'Vaccination Children: 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సిన్ మిక్సింగ్ గందరగోళం నెలకొనకుండా ఉండేందుకు.. ప్రత్యేక టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ! NEET PG Exam EWS Quota: నీట్ పీజీ పరీక్షల్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలుగానే ఉంచనున్నట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. త్రిసభ్య కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నట్లు అఫిడవిట్లో స్పష్టం చేసింది.లా స్టూడెంట్ దారుణ హత్యLaw student killed: 24 ఏళ్ల న్యాయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు కొందరు దుండగులు. విద్యార్థి స్నేహితుడు తప్పించుకున్నా.. రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హరియాణా ఫరీదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. షేర్మార్కెట్లో నష్టంతో.. తల్లిని చంపి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పుణెలో జరిగింది.హనీమూన్ కోసం వెళ్లి..Vaishno Devi incident doctor: వివాహం జరిగిన నెల రోజులకే.. వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో యూపీ వైద్యుడు ప్రాణాలు కోల్పోవడం.. ఆయన కుటుంబంలో విషాదం నింపింది. హనీమూన్ కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరగ్గా.. స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.92 ఏళ్ల వయసులో 2 గోల్డ్ మెడల్స్!ఆయన ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. వయసు 92 ఏళ్లు. కానీ ఇంకా చురుగ్గా క్రీడా పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. శారీరకంగా దృఢంగా ఉండేందుకు కృషి చేసే హరేశ్.. యువత కూడా ఫిట్‌గా ఉండాలని సూచించారు.ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి కరోనాLionel Messi Covid: అర్జెంటినా ఫుట్‌బాల్ స్టార్ లియోనాల్ మెస్సీకి కరోనా సోకింది. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలిందని పీఎస్జీ ఫుట్‌బాల్ క్లబ్ పేర్కొంది.'రావణాసుర'గా రవితేజShyam Singha Roy: కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. నాని 'శ్యామ్ సింగరాయ్' పోస్ట్ రిలీజ్ ట్రైలర్, మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.