తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ న్యూస్​ @9PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ న్యూస్​ @9PM
టాప్​ న్యూస్​ @9PM

By

Published : Jan 1, 2022, 9:00 PM IST

  • రాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్​

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది.

  • నుమాయిష్​ సందడి షురూ..

Numaish in Hyderabad 2022: హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్‌)ను గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆరెకరాల స్థలంలో 1,500 వరకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. నో మాస్క్‌.. నో ఎంట్రీ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో రౌండ్‌ ది క్లాక్‌ ఫ్రీ వ్యాక్సినేషన్‌ కేంద్రం కూడా ఏర్పాటు చేయటం గమనార్హం.

  • న్యూఇయర్​ వేళ తీవ్ర విషాదం

Road accident: నూతన సంవత్సర వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంతా ఆనందంగా ఉండగా.. రెండు కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాతపడ్డారు.

  • న్యూ ఇయర్​ కానుక- రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు

Kisan Samman Nidhi: ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 10వ విడత నిధులను విడుదల చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా వర్చువల్​గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు.

  • కొవిడ్ వ్యాక్సిన్​ అని చెప్పి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్​

Sterilization on pretext of vaccination: అతనో రోజు కూలీ. కరోనా టీకా వేయిస్తానని ఓ వ్యక్తి చెబితే నమ్మాడు. రూ.2,000 ఇచ్చి మరీ ఆ వ్యక్తి వెంట వెళ్లాడు అతడు. అయితే.. అతనికి కొవిడ్​ టీకా వేయించకుండా.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించాడు ఆ దుండగుడు.

  • గుడ్​ న్యూస్​.. తగ్గిన గ్యాస్ ధర

LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ. 102.50 మేర తగ్గించినట్లు చమురు సంస్థలు తెలిపాయి. సవరించిన ధర శనివారం అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి.

  • దిల్లీ, మహారాష్ట్రలో కరోనా విలయం

India covid news: పలు రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 9,170 కేసులు వెలుగులోకి వచ్చాయి. బంగాల్​లో 4,512, దిల్లీలో 2,716.. కేరళలో 2,435 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.

  • ప్రతిష్టంభన వేళ స్వీట్లు పంచుకున్న భారత్​- చైనా సైన్యం

India China Army: తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. భారత్​- చైనా సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

  • 'ఒమిక్రాన్​తో ఆస్పత్రుల్లో చేరే ముప్పు తక్కువే

Omicron hospitalization: కరోనా డెల్టా వేరియంట్​తో పోలిస్తే 'ఒమిక్రాన్' సోకిన వారిలో మూడింట కేవలం ఒక వంతు వారికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావొచ్చని ఓ అధ్యయనం తెలిపింది. ఒమిక్రాన్‌ కట్టడిలో టీకాలు బాగా పనిచేస్తాయని కూడా చెప్పింది.

  • 'ఆర్ఆర్ఆర్' సినిమా మళ్లీ వాయిదా

RRR postponed: ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడిన 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మరోసారి మారింది. జనవరి 7న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం లేదని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తనపై ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details