ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుపెట్టుబడి సాయం విడుదల Kisan Samman Nidhi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత నిధులను విడుదల చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు.'రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం'Shaikpet Flyover Opening: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద నగరంలో నిర్మించిన అతి పెద్ద పైవంతెన షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.'రీజినల్ రింగ్‌రోడ్ తెలంగాణకు మరో మణిహారం' Union Minister Kishan reddy: హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. నగరంలో స్కైవేల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. రీజినల్ రింగ్‌రోడ్డుకు సంబంధించి త్వరగా భూ సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నగరంలో నిర్మించిన షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు.కశ్మీర్లో గుప్కార్ నేతల గృహనిర్భందం!gupkar alliance leaders arrest: పునర్విభజన కమిషన్ సిఫార్సులను వ్యతిరేకిస్తూ గుప్కార్ కమిటీ చేపట్టబోయిన ఆందోళనలను జమ్ము కశ్మీర్ పోలీసులు అడ్డుకున్నారు. గుప్కార్ నేతలను ముందస్తుగానే గృహనిర్భందంలోకి తీసుకున్నారు.సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు కొత్త ఏడాది సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న మెంధార్ హాట్ స్ప్రింగ్స్, పూంచ్ రావల్ కోట్, చకోటి ఉరి, చిల్లియానా తివాల్ క్రాసింగ్ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. పరస్పరం కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.'కలిసికట్టుగా పనిచేస్తేనే.. కొవిడ్-19కు ముగింపు'Tedros Adhanom on Covid: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న దేశాల మధ్య నెలకొన్న అసమానతలు అంతమైతేనే.. కరోనా మహమ్మారికి ముగింపు లభిస్తుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్. దేశాలన్ని కలిసికట్టుగా పనిచేస్తే.. 2022లోనే కొవిడ్ ముగుస్తుందనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు.ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఇలా..Gold Price Today: దేశంలో బంగారం ధర రూ.220 పెరిగింది. వెండి ధర కూడా రూ. 500 మేర వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?ఘనంగా టీమ్ఇండియా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్Teamindia New Year celebrations: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకొంది. ఆటగాళ్లంతా కేక్ కట్ చేసి సరదాగా గడిపారు. వాటిని సంబంధించిన ఫొటోలను కోహ్లీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా, దిగ్గజ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్ సహా పలువురు మాజీలు సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు స్పెషల్ విషెస్ తెలిపారు.షణ్ముఖ్-దీప్తి సునయన జోడీ బ్రేకప్Depthi sunaina shanmukh: యూట్యూబర్స్ దీప్తి సునయన, షణ్ముక జస్వంత్.. తమ ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.'రాధేశ్యామ్' కొత్త పోస్టర్.. సంక్రాంతికి సినిమా పక్కాRadhe shyam movie: 'రాధేశ్యామ్' సినిమా సంక్రాంతి రేసులోనే ఉంది. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఈ విషయం స్పష్టమైంది.