తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్​న్యూస్​@ 1PM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS, telangana top ten telugu news
టాప్​న్యూస్

By

Published : Jan 1, 2022, 12:59 PM IST

  • అదే నా ఆకాంక్ష'

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్​లో కొత్త సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

  • తగ్గిన గ్యాస్ ధర

LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ. 102.50 మేర తగ్గించినట్లు చమురు సంస్థలు తెలిపాయి. సవరించిన ధర శనివారం అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి.

  • తెగ తాగేశారుగా..!

తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడు పోయింది. 2021 జనవరి నుంచి డిసెంబరు వరకు 30వేల కోట్లకుపైగా విలువైన 3.69 కోట్ల కేసులు లిక్కర్‌, 3.26కోట్లు కేసుల బీరు విక్రయాలు జరిగాయి.

  • 'రైతులు, పేదలు రెండు కళ్లు'

vemula prashanth interview : యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయన్న మంత్రి... అది తెలిసే భాజపా నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదన్న ఆయన విభజన చట్టం హామీలు సహా ఏవీ నెరవేర్చలేదని ఆరోపించారు.

  • శ్రీవారి సేవలో ప్రముఖులు

నూతన సంవత్సరం సందర్భంగా కలియుగ దైవం తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • ప్రజాప్రతినిధులకు కరోనా

మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధరణ అయింది. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో వీరికి కొవిడ్ సోకినట్లు తేలడం కలకలం రేపింది.

  • పది మంది దుర్మరణం!

హరియాణా భివానీ జిల్లా డడమ్​ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుండగా కొండపర్వతం విరిగిపడింది.

  • బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు

తమిళనాడు శివకాశిలోని ఎం.పుడుపట్టి గ్రామంలో ఉన్న వడివెల్​ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

  • 'ఒలింపిక్స్ పతకమే లక్ష్యం'

ఒలింపిక్స్​ పతకం కోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నానని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత కిదాంబి శ్రీకాంత్ చెప్పారు. ఫిట్​నెస్ కాపాడుకుంటూ గోపీచంద్ అకాడమీలో ప్రపంచస్థాయి శిక్షణ తీసుకుంటున్నానని వెల్లడించారు.

  • బాలయ్య కొత్త సినిమా డైలాగ్​ లీక్

బాలయ్య సినిమా అంటే అదిరిపోయే డైలాగ్​లు. ఆయన సినిమాలో ఫైట్లు, డైలాగ్స్​ కోసమే థియేటర్​కు వెళ్లేవాళ్లు చాలామంది. అలాంటి బాలకృష్ణ కొత్త సినిమాలోని ఓ డైలాగ్ ముందే లీకైతే..

ABOUT THE AUTHOR

...view details