ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలుపుతిన్కు తీవ్ర అస్వస్థత.. వైద్యుల్లో టెన్షన్ టెన్షన్! రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పారామెడికల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఆయన గదికి చేరుకున్న వైద్యులు మూడు గంటలపాటు చికిత్స అందించినట్లు సమాచారం.బంగాల్‌లోనూ 'ఆపరేషన్ శిందే!'..బంగాల్ రాజకీయం కీలక మలుపు తిరగనుందా? మహారాష్ట్ర తరహా పరిణామాలకు వేదిక కానుందా? ఔననే అంటున్నారు నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి. టీఎంసీ మాత్రం ఆయన వాదనల్ని కొట్టిపారేసింది.హ్యాట్సాఫ్ పోలీస్.. వరదనీటిలో దూకి వ్యక్తిని కాపాడిన ఎస్‌ఐ ప్రాణాలకు తెగించి.. పీకల్లోతు నీటిలో దూకి మునిగిపోతున్న వ్యక్తిని కాపాడాడు ఎస్‌ఐ. ఈ ఘటన హైదరాబాద్ జియాగూడ వద్ద చోటుచేసుకుంది. ఇది చూసిన ప్రజలు ఎస్‌ఐను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.జంట జలాశయాలకు భారీవరద..హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతమైన నయాపూల్ను వరద ముంచెత్తింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీరు దిగువకు విడుదల చేయడంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలసంద్రంగా మారాయి.ఎమ్మెల్యే రాజాసింగ్ అలక సంచలనాత్మక, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇప్పుడు అలక మంచం ఎక్కారు. తెరాస నేతలపై విమర్శలు, కేటీఆర్‌పై సెటైర్లు, బుల్డోజర్ల కామెంట్లతో హల్చల్ చేసే.. రాజాసింగ్ అలకకు కారణమేంటీ.. అసలు ఆ అలక ఎవరి మీద అనుకుంటున్నారా..?ఇంటి కింద పది కోట్లు..నక్సలైట్ల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 11మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.10కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో జరిగింది. మరో ఘటనలో ఖాండ్వా జిల్లాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.రైల్వేలో 'వృద్ధుల రాయితీ' పునరుద్ధరణ.. వయోవృద్ధుల రాయితీని పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనరల్, స్లీపర్ తరగతులకే రాయితీని పరిమితం చేసే ఆలోచన ఉన్నట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. 70ఏళ్లు పైబడిన వారికే రాయితీ ఇచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి.లాక్డౌన్లో బోర్ కొట్టి విమానం తయార్..పైలట్ లైసెన్స్ కలిగిన అశోక్ గతంలో టూ సీటర్ విమానాలను అద్దెకు తీసుకొని అందులో విహారయాత్రలు చేసేవాడు. వివాహం, అనంతరం ఇద్దరు కుమార్తెలు కలగడంతో ఆయనకు నాలుగు సీట్ల విమానం అవసరమయ్యింది. ఈ విమానాలు అద్దెకు అరుదుగా లభిస్తుండటం, అవీ పాతవి కావడంతో తానే ఓ ఫోర్ సీటర్ విమానాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇందుకు లాక్‌డౌన్ కాలం కలిసొచ్చింది.ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా దాదా ఎంపిక ఖరారైనట్లేనా? ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా బోర్డు స్పందించలేదు.'బింబిసార' కొత్త ట్రైలర్.. కల్యాణ్ రామ్ అదరగొట్టేశాడుగానందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' కొత్త ట్రైలర్ వచ్చేసింది. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది.