తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP TEN NEWS: టాప్‌టెన్ న్యూస్ @9PM - TELANGANA TOP NEWS

ఇప్పటిదాకా ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS

By

Published : Feb 21, 2022, 9:00 PM IST

  • గౌతమ్‌ రెడ్డి చివరి మాటలు!

Mekapati Goutham Reddy passed away: నొప్పి ఏదైనా.. మనకు అది బాధ మాత్రమే. కానీ, మనవాళ్లకు మాత్రం నరకం! గుండెపోటులాంటి తీవ్రమైన ప్రాణాంతక పరిస్థితులు వారు భరించలేని.. మాటల్లో చెప్పతరం కానివి! మనవాళ్లు పడుతున్న అవస్థను చూసి తట్టుకోలేక.. చేయడానికి ఏమీలేక.. మిన్ను విరిగి మీదపడుతున్నట్టుగా.. కాళ్ల కింది భూమి కదిలిపోతున్నట్టుగా గుండెల్లో భయం విస్పోటనమైన వేళ.. మనవాళ్ల హృదయం ఎంతలా తల్లడిల్లిపోతుందో తెలుసా? మేకపాటి గౌతమ్‌ రెడ్డి సతీమణి.. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు!

  • దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి

CM KCR National Politics: భారతదేశం బాగుకోసమే తాను దేశ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంగారు భారత్‌ను తయారు చేసుకుందామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు.

  • జగ్గారెడ్డి కామెంట్స్​పై రేవంత్​ రెడ్డి

Revanth Reddy on JaggaReddy: జగ్గారెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని... తాను రాజకీయాల్లోకి రాకముందు కూడా పరిచయం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి చెప్పారు. జగ్గారెడ్డి ఇష్యూ .. తమ కుటుంబ సమస్య అని.. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపారు. జగ్గారెడ్డిపై సోషల్​ మీడియాలో వచ్చిన పోస్టులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

  • ఆత్మహత్యల తెలంగాణగా మార్చినవ్

Bandi Sanjay On CM KCR: దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్యహత్యల రాష్ట్రంగా మార్చి... దేశాన్ని కూడా అదే రీతిలో తయారు చేయడానికి సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

  • నౌకాదళ శక్తిని మరోసారి చాటారు

Presidential Fleet Review: దేశ నౌకాదళం.. మేకిన్ ఇండియాలో ముందంజలో ఉందన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. ఏపీలోని విశాఖలో జరుగుతున్న 'ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నేవీ విన్యాసాలను తిలకించారు. కరోనా వేళ దేశ నౌకాదళ పాత్ర అద్వితీయమని రాష్ట్రపతి కొనియాడారు.

  • లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష

Lalu Prasad Yadav News: దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధించింది రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

  • ఉక్రెయిన్ జవాన్లపై రష్యా సైన్యం దాడి

Russia Ukraine conflict: ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దుల్లో కాల్పుల మోత ప్రారంభమైంది. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో అయిదుగురు ఉక్రెయిన్‌ సైనికులు మరణించినట్లు రష్యా ప్రకటించింది. సాయుధ దళాల వాహనాలను కూడా.. ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలన్న రష్యా ప్రణాళిక ప్రారంభమైందని బ్రిటన్‌ పేర్కొంది.

  • వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇక బంద్!

Work from home ends: దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు వర్క్​ ఫ్రమ్​ హోమ్​కు స్వస్తి పలికేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి నుంచే ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేయాలని ఇప్పటికే పలు సంస్థలు ఆదేశాలు ఇచ్చాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టటం, ఉద్యోగులు పూర్తిస్థాయిలో టీకా తీసుకోవటమే ఇందుకు కారణమని ఆయా సంస్థలు చెబుతున్నాయి.

  • విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి

Vijay rashmika marriage: 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచిన జోడీ.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే మాత్రం కచ్చితంగా విజయ్-రష్మికలలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.

  • రైనాకు సీఎస్కే వీడ్కోలు

Suresh Raina CSK: ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​(సీఎస్​కే) స్టార్​ బ్యాటర్​ సురేశ్​ రైనాకు భావోద్వేగ వీడ్కోలు పలికింది. సుదీర్ఘంగా సేవలందించిన రైనాకు ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​కు ముందే సాగనంపింది.

ABOUT THE AUTHOR

...view details