ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్.. CM KCR in Muchital: హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో నిన్న(ఫిబ్రవరి 2) ప్రారంభమైన శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. చిన జీయర్ స్వామితో కలిసి దివ్యక్షేత్రమంతా కలియ తిరుగుతూ.. ఏర్పాట్లను, క్రతువులను పర్యవేక్షించారు.మేడారం జాతరకు 4వేల ప్రత్యేక బస్సులు.. MEDARAM Special Busses : మేడారం సమ్మక్క సారలమ్మను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దర్శించుకున్నారు. ఈనెల 16 నుంచి 19 వరకు జరగనున్న జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆయన ప్రకటించారు.కాంగ్రెస్ నేతల 48 గంటల దీక్ష.. congress diksha on kcr comments: రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దీక్ష చేపట్టింది. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు 48గంటలపాటు దీక్షలో కూర్చుండనున్నారు.ద.మ రైల్వేకు నిధుల కేటాయింపులు ఇవే.. Railway Budget 2022- 23 under SCR: 2022- 23 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన కేటాయింపుల వివరాలను జీఎం సంజీవ్ కిషోర్ వెల్లడించారు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రూ.10,080 కోట్లు కేటాయించగా తెలంగాణకు రూ.3,048 కోట్లు కేటాయించారు.వారికి మద్దతుగా బాలయ్య దీక్ష.. Balakrishna Deeksha: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రేపు మౌనదీక్ష చేపట్టనున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అసదుద్దీన్ కారుపై కాల్పులు.. Attack on Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడి జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దిల్లీ వెళ్తుండగా.. ఓ టోల్గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. 3-4 తూటాలు దూసుకెళ్లాయని చెప్పారు.ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతంగా కరోనా.. Corona Cases In India: దేశంలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కేరళ, మిజోరాంలో మాత్రం వైరస్ ప్రభావం ఇంకా పెరుగుతోందని స్పష్టం చేసింది.పాక్ సైనిక స్థావరాలపై ఉగ్రదాడి.. Terror Attack on Pak Army Post: బలూచిస్థాన్‌లో పాక్ సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు జరపగా.. సైన్యం ప్రతిఘటించింది. ఈ ఘటనలో 15 మంది ఉగ్రవాదులు, నలుగురు సైనికులు మరణించారు.భారత్-శ్రీలంక పింక్ బాల్ టెస్టు త్వరలో.. Pink Ball Test: భారత్- శ్రీలంక మధ్య బెంగళూరు వెదికగా త్వరలోనే పింక్ బాల్ టెస్టు జరగనుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశారు. శ్రీలంకతో సిరీస్‌పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.కేతికతో వైష్ణవ్ మెలోడీ సాంగ్.. ఈ సినిమాలో వైష్ణవ్, డాక్టర్‌గా కనిపించనున్నట్లు పాట చూస్తే అర్థమవుతోంది. అతడి సరసన కేతికశర్మ హీరోయిన్గా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, గిరీశయ్య దర్శకత్వం వహించారు.