ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం.. Telangana Double Bedroom Houses :రెండు పడకల గదుల ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంతో పాటు వివిధ దశల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోనుంది. అటు రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం కోసం ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది.వాసాలమర్రిలో స్మితా సబర్వాల్ పర్యటన.. Smitha Sabharwal Visited vasalamarri village: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, అధికారులు పర్యటించారు. గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారుల యూనిట్లను పరిశీలించారు. గ్రామస్థులంతా ఐకమత్యంగా ఉంటే వాసాలమర్రి ఆదర్శ గ్రామంగా మారుతుందని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు.టీఎస్ఆర్టీసీ కొత్త వెబ్సైట్.. TSRTC New Website: టీఎస్ఆర్టీసీ నూతన వెబ్‌సైట్‌ను సంస్థ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్.. కొత్త పోర్టల్ tsrtc.telangana.gov.in ను ఆవిష్కరించారు.దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంది.. Republic day in TRS Bhavan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేశవరావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకల్లో మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని.. ప్రజలు కోరుకుంటున్నవన్ని సాకారం అవుతున్నాయని కేకే హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నుంచి వలసలకు కారణమేంటి.. Leaders leaving Congress: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే నాయకత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పార్టీకి.. సీనియర్లు హ్యాండివ్వడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అది కూడా గాంధీ కుటుంబానికి విధేయులు అనుకున్న.. ఆర్పీఎన్ సింగ్ లాంటి నాయకులు దూరం కావడాన్ని నాయకత్వం, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ వరుస వలసలకు కారణం ఏంటి?చీరకట్టులో సాహసం.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ స్కైడైవర్.. శీతాల్ మహాజన్ అద్భుత సాహసం చేశారు. 9 యార్డ్స్(27 అడుగులు) పొడవైన చీర కట్టుకుని.. 6వేల అడుగుల ఎత్తు నుంచి స్కైజంప్ చేసి ఆశ్చర్యపరిచారు. పుణెలోని హదప్సార్ గ్లైడింగ్ సెంటర్లో పారాచూట్ సాయంతో ఈ సాహసం పూర్తి చేశారు మహాజన్. స్కైజంప్లో ఇప్పటికే వరల్డ్ రికార్డు సాధించారు.గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు.. Google CEO Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు సంస్థలోని మరో ఐదుగురిపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.ఎగిరే కారు వచ్చేసింది.. Flying car Slovakia: రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలు, వర్షాలు, రహదారి మరమ్మతుల వంటి సందర్భాల్లో స్తంభిస్తున్న రాకపోకలు.. ఇవన్నీ వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మరి ఈ చిక్కులు లేకుండా రోడ్డుపై వెళ్తున్న కారుతోనే ఆకాశంలో ఎగిరిపోతే.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది త్వరలో నిజం కాబోతోంది. హాలీవుడ్ సినిమాను తలపించేలా భూమిపైన దూసుకుపోతూ, ఆకాశంలో ప్రయాణించే కార్ల కల సాకారం దిశగా కీలక అడుగు పడింది.ఫిట్నెస్ టెస్ట్‌లో హిట్‌మ్యాన్ పాస్.. Rohith sharma fitness test: గాయం నుంచి కోలుకున్న రోహిత్‌శర్మ తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయ్యాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌కు అతడు సారథిగా అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాయి.కొత్త సినిమా అప్డేట్స్.. Ravi Teja Khiladi Movie: కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ నటిస్తోన్న 'ఖిలాడి' సహా శర్వానంద్ కొత్త చిత్రం 'ఒకే ఒక జీవితం' విశేషాలున్నాయి.