తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news
telangana top ten news

By

Published : Jan 12, 2021, 8:58 PM IST

రాష్ట్రానికి కొవిడ్​ టీకా..

పుణె నుంచి హైదరాబాద్​కు కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రత్యేక కార్గో విమానంలో శంషాబాద్‌కు కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి. శంషాబాద్ నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులను తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బ్రెజిల్​కు కొవాగ్జిన్..

బ్రెజిల్​కు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా 'కొవాగ్జిన్​'ను సరఫరా చేయనుంది. ఇందుకోసం భారత్​ బయోటెక్​తో బ్రెజిల్​కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్​ ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'నల్లా బిల్లు కట్టొద్దు..

గ్రేటర్​ హైదరాబాద్​లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రహమత్​నగర్​లో పథకాన్ని మంత్రి కేటీఆర్​ లాంఛనంగా ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి జీరో నీటి బిల్లులు ఇచ్చామన్న మంత్రి... డిసెంబరు నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కిడ్నాప్​తో సంబంధం లేదన్న అఖిలప్రియ

ప్రవీణ్​రావు అపహరణ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ.. రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. సుమారు ఎనిమిది గంటల పాటు ఆమెను ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. భూమా కుటుంబ సభ్యుల పాత్రపైనా లోతుగా ఆరాతీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విద్యాసంస్థలకు మార్గదర్శకాలు

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈనెల 25 నాటికి సిద్ధంగా ఉండాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సుప్రీం స్టే ఇచ్చినా నిరసనలు కొనసాగిస్తాం

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సభ్యులే ఉన్నారని రైతులు అభిప్రాయపడ్డారు. వీరందరూ చట్టాలపై సానుకూలంగా స్పందించినవారేనని పేర్కొన్నారు. అందువల్ల.. కమిటీ ముందు తాము హాజరుకామని, నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎడ్లబండిపై నడ్డా.. జల్లికట్టుకు రాహుల్​

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. జాతీయస్థాయి నేతలు పోటాపోటీగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న సంక్రాంతిని కూడా ఉపయోగించుకుందామని నిర్ణయించుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ రోజు అమెరికాలో అల్లర్లు!

జనవరి 20న అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అగ్రరాజ్యంలో అల్లర్లు జరిగే అవకాశముందని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ(ఎఫ్​బీఐ) హెచ్చరించింది. ట్రంప్​ మద్దతుదారులు ఆయుధాలతో అల్లర్లకు పాల్పడేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సైనా, ప్రణయ్​కు కరోనా నెగిటివ్​

థాయ్​లాండ్​ ఓపెన్​లో తొలుత కరోనా పాజిటివ్​గా తేలిన భారత స్టార్​ షట్లర్లు​​ సైనా నెహ్వాల్, ప్రణయ్​కు మళ్లీ చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్​గా తేలింది. దీంతో వారిద్దరు బుధవారం జరగబోయే మ్యాచ్​లలో బరిలో దిగనున్నారని బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా(బాయ్​)​ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'పెళ్లిసందడి' 2.o

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాల్లో క్లాసిక్​గా నిలిచిపోయింది 'పెళ్లిసందడి'. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యింది. ఇందులో హీరోగా నటించిన శ్రీకాంత్​ కుమారుడు రోషన్​తో ఇప్పుడు మోడరన్​ 'పెళ్లిసందడి'ని రూపొందించనడానికి సిద్ధమయ్యారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. నయా 'పెళ్లిసందడి' గురించి ఆయనే స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details