- పుల్వామా ఉగ్రదాడికి రెండేళ్లు..
పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు అవుతోన్న సందర్భంగా అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. జవాన్ల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దేశంలో మరో 12,194 మందికి కరోనా సోకింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 92 మంది మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 82 లక్షల 63 వేల 858 మంది కరోనా టీకా తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 146 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి మరో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ప్రేమ విఫలమైందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఒంటికి నిప్పంటించుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ప్రేమికుల రోజునే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మోకిల తండాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ప్రముఖ కలంకారీ కళాకారుడు జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న జొన్నలగడ్డ ఈరోజు తుదిశ్వాస విడిచారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఉత్తరాఖండ్ ఘటనలో తపోవన్ సొరంగంలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో చిక్కుకున్న 30 మంది కోసం ఏడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా లభించిన మృతదేహాలతో మొత్తం మృతుల సంఖ్య 40కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఇటీవల కాలంలో పర్సనల్ లోన్ తీసుకోవటం చాలా సులభం అయిపోయింది. త్వరగా రుణం మొత్తం ఖాతాలో జమౌతుండటం, తక్కువ డాక్యుమెంటేషన్, రుణాన్ని ఎలాగైనా ఉపయోగించుకునేందుకు వెసులుబాటు ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో ఈ రుణం తీసుకుంటుంటారు. మరి ఏయే విషయాల ఆధారంగా వ్యక్తిగత రుణం ముంజూరు అవుతుంది. మీకు రుణం కావాలంటే ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రెండో టెస్టు: భారత్ ఆలౌట్
రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. అనంతరం పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో 50 పరుగులు పూర్తి చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ప్రేమలో పడితే ఎవ్వరైనా స్వర్గంలో విహరిస్తుంటారు. కొంతమంది జీవితంలో ఆ ప్రేమను సాధించే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటారు. వయసు, మతాల తారతమ్యాలు ఇలా ఎన్ని ఎదురైనా అవేవీ నిజమైన ప్రేమకు అడ్డుకాదని నిరూపించారు కొంత మంది తారలు. 'ప్రేమికుల దినోత్సవం' సందర్భంగా బాలీవుడ్లో ప్రేమతో ఒకటై జీవనాన్ని సాగిస్తున్న తారల జంటలపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి